Nine Members Suicide: మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మది మంది వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు. అయితే ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబయి నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.


"మేము ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలను కనుగొన్నాము. మూడు మృతదేహాలు ఒకే చోట, ఇతర వేర్వేరు ప్రదేశాలలో ఆరు మృతదేహాలు ఇంట్లో లభ్యమయ్యాయి" అని సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు మరో పోలీసు అధికారి చెప్పారు. మృతులు విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.
ఇవీ చదవండి: నూడిల్స్ తిని రెండేళ్ల బాలుడు మృతి.. తల్లి అలా చేయడం వల్లే...!