ETV Bharat / bharat

'మా రోబో'ను సృష్టించిన దినసరి కూలీ.. దివ్యాంగురాలైన కుమార్తె కోసం ఆవిష్కరణ - రోబో తయారుచేసిన గోవా కూలీ

దివ్యాంగురాలైన కుమార్తె కోసం ఓ రోబో లాంటి పరికరాన్నే తయారు చేశాడు గోవాకు చెందిన ఓ దినసరి కూలీ. సాంకేతికతపై ఎలాంటి అవగాహన లేకున్నా.. ఈ పరికరాన్ని రూపొందించి ఆశ్చర్యపరిచాడు.

goa worker robot
goa worker robot
author img

By

Published : Sep 26, 2022, 9:45 AM IST

దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల బిపిన్‌ కదమ్‌కు దివ్యాంగురాలైన తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది. రెండేళ్ల క్రితం వరకూ ఆ బాధ్యత చూసుకున్న ఆయన భార్య కూడా జబ్బుతో మంచాన పడడంతో ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ రోబో లాంటి పరికరాన్ని తయారు చేస్తే అదే తన కుమార్తెకు భోజనం పెట్టేందుకు సహకరిస్తుందని భావించాడు.

దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన కదమ్‌కు సాంకేతికతపై ఎలాంటి అవగాహనా లేదు. అయినా తన కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు సాంకేతికతే ఒక పరిష్కారం చూపుతుందని భావించి ఏడాది క్రితం నుంచి రోబో లాంటి పరికరం కోసం అన్వేషించాడు. ఎక్కడా లభించకపోవడంతో తనకు తానే అలాంటి దానిని తయారు చేసేందుకు పూనుకున్నాడు. నిత్యం 12 గంటల పాటు ఇతర పనులు చేసుకొని ఆ తరవాత మిగిలిన సమయంలో సాఫ్ట్‌వేర్‌పై అవగాహన పెంచుకున్నాడు. నాలుగు నెలలు శ్రమించి ఒక రోబోను తయారుచేసి దానికి 'మా రోబో' అని పేరు పెట్టాడు. పూర్తిగా వాయిస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్‌ కమాండ్‌ను వాడుకుంటూ.. ఆహారాన్ని కూరతో లేదా పప్పుతో కలిపి తినాలని భావిస్తోందా అన్నది ఆ అమ్మాయి తెలియజేస్తే .. ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణను గోవా స్టేట్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రశంసించింది. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది.

.

ఇవీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. 10 మందికి గాయాలు

రాజస్థాన్​ కాంగ్రెస్​లో సంక్షోభం.. రాజీనామాకు 90 మంది ఎమ్మెల్యేలు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.