ETV Bharat / bharat

ప్రియురాలి మర్డర్​.. రాత్రి కలలోకి దెయ్యమై వచ్చి వేధిస్తోందన్న ప్రియుడు - ఛత్తీస్​గఢ్ కోర్బా లేటెస్ట్ న్యూస్

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందని ప్రియురాలిని హత్య చేశాడో వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఈ దారుణం ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

lover killed girlfriend
ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
author img

By

Published : Jan 12, 2023, 3:25 PM IST

ఛత్తీస్​గఢ్​ కోర్బాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందని ప్రియురాలిని హతమార్చాడు ఓ వ్యక్తి. 8 నెలల కిందట జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాను చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాంపుర్​ చౌకీకి చెందిన అంజు యాదవ్(24) అనే యువతి గోపాల్ ఖడియాను ప్రేమించింది. అతడినే పెళ్లాడాలని కలలు కంది. ఈ నేపథ్యంలో అంజు తన ఇంటి నుంచి పారిపోయి గోపాల్​తో కలిసి జీవించేది. రెండు నెలల గడిచాక ఓ రోజు తనను పెళ్లి చేసుకోమని గోపాల్​ను కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన గోపాల్​ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అడవిలోకి తీసుకెళ్లి పాతిపెట్టాడు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు చేయగా అంజును ఆమె ప్రియుడు గోపాల్​ హత్య చేసినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎదుట పలు ఆశ్చర్యకర విషయాలను చెప్పాడు గోపాల్​. తనకు అంజు కలలో దెయ్యం రూపంలో కనిపించి మానసిక వేదనకు గురిచేస్తోందని తెలిపాడు. ప్రశాంతంగా జీవించలేకపోతున్నానని పేర్కొన్నాడు. అంజు మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చెప్పాడు.

lover killed girlfriend
నిందితుడు గోపాల్

"అంజు, గోపాల్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అంజు ఇంటి నుంచి పారిపోయి గోపాల్​తో కలిసి జీవించేది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం వల్ల గోపాల్.. అంజును హత్య చేశాడు. అతడు నేరాన్ని అంగీకరించాడు. అంజు మృతదేహం పాతిపెట్టిన ప్రదేశాన్ని చెప్పాడు. మేజిస్ట్రేట్​ సమక్షంలో అంజు మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీశాం. ఆమె అస్తిపంజరాన్ని డీఎన్​ఏ పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపాం. అంజు పట్టీలను చూసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు."

--పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.