ETV Bharat / bharat

తెరుచుకున్న శబరిమల ఆలయం- భక్తులకు అనుమతి

వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది. ఇవాళ్టి నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ముంబయిలోని సిద్ధి వినాయక, శిర్డీ సాయిబాబా ఆలయాల్లోకి కూడా భక్తులకు అనుమతి కల్పించనున్నారు.

Lord Ayyappa temple opens, devotees to be allowed from Nov 16
శబరిమల ఆలయంలోకి భక్తులకు అనుమతి
author img

By

Published : Nov 16, 2020, 5:04 AM IST

కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య శబరిమల ఆలయంలోకి ఇవాళ్టి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. 2 నెలలపాటు కొనసాగే వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం ఆలయాన్ని ఆదివారం తెరిచారు. డిసెంబర్​ 26 వరకు తెరిచే ఉంచనున్నారు. ఆలయ ప్రధాన పూజరి ఏకే సుధీర్ నంబూత్రి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు.

Lord Ayyappa temple opens, devotees to be allowed from Nov 16
తెరుచుకున్న శబరిమల ఆలయం

ఈ ఉదయం నుంచి రోజుకు వెయ్యి మంది భక్తులను, వారాంతాల్లో 2వేల మందిని అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులందరికీ కరోనా పరీక్ష నిర్వహించనుండగా 60ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. దగ్గు, జలుబు ఉన్నవారు, ఇటీవల కరోనా నుంచి కోలుకున్నవారు కూడా దర్శనానికి రావొద్దని శబరిమల ఆలయ మండలి సూచించింది.

శబరిమల ఆలయం

మార్గదర్శకాలివే..

  • భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం "https://sabarimalaonline.org" వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • రోజుకు గరిష్ఠంగా 1,000 మంది భక్తులకు అనుమతి ఇస్తారు. పరిస్థితుల ఆధారంగా మార్పులు చేసే అవకాశం.
  • శబరిమలకు వచ్చే భక్తులంతా 24 గంటల ముందు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్య ఫలితాల్లో నెగటివ్​ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి. గతంలో 48 గంటల ముందు పరీక్షలు చేయించుకున్నా ఆలయంలోకి అనుమతించేవారు.
  • రాకపోకల సమయాల్లోనూ భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందే. ప్రతి 30 నిమిషాలకు శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. భక్తులతో పాటు వచ్చే డ్రైవర్లు ఈ నిబంధనలు పాటించాలి.
  • ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిల్లోనూ నెగెటివ్​ రావాల్సిందే.
  • ఈ మధ్యకాలంలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ఉంటే వారికి ఫిట్​నెస్​ టెస్టు నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితిని విచారించి, లక్షణాలు లేకుండా ఫిట్​గా ఉన్నారని ధ్రువీకరించుకున్నాకే ఆలయంలోకి అనుమతి ఇస్తారు.
  • పది సంవత్సరాలలోపు వారికి, 60-65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు శబరిమల యాత్రకు రాకూడదు.
  • యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కరోనా సోకితే.. వారి కోసం చికిత్స సదుపాయాలు కల్పిస్తున్నారు.
  • స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు సహా సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.

ఆ ఆలయాలు కూడా..

  • కరోనా ప్రభావం కాస్త తగ్గిన నేపథ్యంలో మహారాష్ట్ర ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం నేడు తెరుచుకోనుంది. అయితే.. ఇక్కడ కూడా రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. మొబైల్​ అప్లికేషన్​ ద్వారా భక్తులు ముందస్తుగా పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు ఆలయ ఛైర్మన్​ ఆదేశ్​ బండేకర్​.

    సిద్ధివినాయక ఆలయం
  • ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. షిర్ఢీలోని ప్రముఖ సాయిబాబా ఆలయంలోకి సోమవారం నుంచి భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు.

    షిర్డీ సాయిబాబా ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.