ETV Bharat / bharat

Lokesh Anticipatory Bail Petition in AP High Court: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసు..ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ - ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

Lokesh Anticipatory Bail Petition in AP High Court: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీఐడీని ఆయుధంలా వినియోగిస్తోందని లోకేశ్ ఆరోపించారు. తనను, తన కుటుంబసభ్యులు, టీడీపీను అవమానపరిచేందుకే నిందితుడిగా చేర్చారని మండిపడ్డారు. ఈ నెల 29న లోకేశ్ పిటిషన్‌ విచారణకు రానుంది.

Lokesh_Anticipatory_Bail_Plea_in_AP_High_Court

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 7:14 AM IST

Lokesh Anticipatory Bail Plea in AP High Court: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసు..ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

Lokesh Anticipatory Bail Petition in AP High Court : రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదు చేసిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసులో (IRR Alignment Case) ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళగిరి సీఐడీ ఠాణా S.H.Oను ప్రతివాదిగా పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (AP Skill Development
Case) తన తండ్రి చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత తననూ అరెస్టు చేస్తారని వైసీపీ నేతలు పలు వేదికలపై ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. వారు చెప్పినట్లే సీఐడీ అధికారులు అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారని మండిపడ్డారు.

అనిశా కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఎలాంటి కొత్త వివరాలను పేర్కొనలేదని నారా లోకేశ్ వివరించారు. తననూ, తన కుటుంబసభ్యులను, తెలుగుదేశంను అవమానపరిచేందుకే నిందితుడిగా చేర్చారని ఆరోపించారు. జగన్‌ సర్కార్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీఐడీని పావులాగా వాడుకుంటోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులను నిలిపివేసిందని తెలిపారు.

Arguments in AP High Court on Inner Ring Road: హైకోర్టులో ఇన్నర్​ రింగ్​ రోడ్డు ప్రాజెక్టు వాదనలు.. "ఆ ప్రాజెక్ట్‌ కేవలం కాగితాలకే పరిమితమైంది"

రింగ్‌రోడ్డు కోసం ఒక్క అంగుళం స్థలాన్నీ సేకరించలేదని వెల్లడించారు. ఈ వ్యవహారంపై అధికార పార్టీ ఎమ్మెల్యే 2022 ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దురుద్దేశంతో కేసు నమోదు చేశారని లోకేశ్ తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ ఇంట్లో తానూ ఉన్నానని ఈ కేసులో నిందితుడిగా చేర్చారని ఈ కారణంతో నిందితుడిగా చేర్చడానికి వీల్లేదని పేర్కొన్నారు.
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు (Amaravati Ring Road Project) వ్యవహారంలో మంత్రి హోదాలో గానీ, ఇతర ఏ హోదాలో గానీ తాను జోక్యం చేసుకోలేదని లోకేశ్ స్పష్టం చేశారు. అందువల్ల తనపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్‌ 409 కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవి మాత్రమేనన్నారు.

TDP PowerPoint Presentation on Inner Ring Road ఇన్నర్ రింగ్‌రోడ్డ్‌ ప్రాజెక్టు-వాస్తవాలపై టీడీపీ.. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్.. వేయని రోడ్డుతో లబ్ది ఎలా?

హెరిటేజ్‌ ఫుడ్స్‌లో తాను ఏ హోదాలోనూ లేనని ఇప్పటికే సీఐడీ కోరిన వివరాలను ఆ సంస్థ అందజేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు.హెరిటేజ్‌ అనుచిత లబ్ధి పొందినట్లు దర్యాప్తు సంస్థ ఒక్క దస్త్రాన్నీ చూపలేకపోతోందని కేసు నమోదుచేసి ఇన్ని రోజులు గడుస్తున్నా విచారణ కోసం ఎలాంటి నోటీసూ ఇవ్వలేదని లోకేశ్ తెలిపారు.

Lokesh Petition Will be Heard on September 29th in IRR Case : రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర (Nara lokesh Yuvagalam padayatra) చేస్తున్నానని ఎలాంటి కారణం లేకుండా తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో తెలిపారు. ఇదే కేసులో ఇతర నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిలు ఇచ్చిందని గుర్తు చేశారు. అనినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-A ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు, దర్యాప్తు చెల్లవన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యం ఈ నెల 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి ముందు విచారణకు రానుంది.
TDP Leaders On Inner Ring Road Case: వైసీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే... లేని ఇన్నర్ రింగ్‌ రోడ్డుపై కేసులు: టీడీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.