పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెంపుపై విపక్షాల ఆందోళనతో.. లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి.
ధరల పెంపుపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు రేపటికి వాయిదా - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
14:12 July 19
11:16 July 19
ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉభయ సభలను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే.. ధరల పెరుగుదల, అగ్నిపథ్ పథకంపై చర్చ జరపాలని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆందోళనలు తెలిపాయి. దీంతో రాజ్యసభలో కాసేపు గందరగోళం నెలకొంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే.. ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు 267 నిబంధన ప్రకారం సంబంధిత అంశాలపై చర్చ జరపాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసును ఛైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. సభ్యుల నిరసనతో ఎగువసభను 2 గంటలకు వాయిదా వేశారు వెంకయ్య నాయుడు.
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష సభ్యులు కొన్ని కొత్త వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి వచ్చారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీలను తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఈ నేపథ్యంలో.. లోక్‌సభను కూడా 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
అంతకుముందు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద.. ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ధరల పెంపుపై ఆందోళన చేపట్టాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లగా.. సభను మంగళవారానికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.