ETV Bharat / bharat

విషమంగా లాలూ ఆరోగ్యం.. సీఎం పరామర్శ.. ఎయిర్​ అంబులెన్స్​లో దిల్లీకి తరలింపు

author img

By

Published : Jul 6, 2022, 3:16 PM IST

Updated : Jul 6, 2022, 10:25 PM IST

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను బుధవారం రాత్రి దిల్లీకి ఎయిర్ అంబులెన్స్​లో తరలించారు. తర్వాత మరీ అవసరమైతే సింగపూర్​కు తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

Lalu Prasad Yadav Health Update
Lalu Prasad Yadav Health Update

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. బుధవారం రాత్రి ఎయిర్​ అంబులెన్స్​లో దిల్లీకి తరలించారు. లాలూ కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆదివారం.. పట్నాలోని ఆయన నివాసంలో మెట్లపై నుంచి పడిపోగా కుడి భుజం ఫ్రాక్చరైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పట్నా ఆస్పత్రిలో బుధవారం లాలూను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ పరామర్శించారు. ఆర్​జేడీ అధినేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా మరికొందరు అగ్రనేతలు లాలూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంగళవారం లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్​కు మోదీ ఫోన్​ చేశారు.

"ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయనకు కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దిల్లీలోని వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారు. అందుకే మేము ఆయన్ను వైద్యం కోసం దిల్లీ తీసుకెళ్తున్నాం. మరీ అవసరమైతే చికిత్స కోసం సింగపూర్​ తరలిస్తాం. మోదీ, రాహుల్ సహా ఇతర రాజకీయ పార్టీల్లోని నేతలంతా ఫోన్ చేసి, లాలూ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఈ సమయంలో మేమంతా ఒక్కటిగా ఉన్నాం." అని నితీశ్​ పరామర్శ తర్వాత చెప్పారు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్.

Last Updated : Jul 6, 2022, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.