ETV Bharat / bharat

'లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమే' - లఖింపుర్ ఖేరీ కేసు

Lakhimpur Kheri Case: లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లఖింపుర్​ ఖేరీ ఘటన జరిగిందన్న సిట్ నివేదికను ఆయన​ సమర్థించారు.

rahul
రాహుల్
author img

By

Published : Dec 15, 2021, 3:40 PM IST

Lakhimpur Kheri Case: లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితంగానే జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ ఉద్ఘాటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లఖింపుర్​ ఖేరీ ఘటన జరిగిందన్న సిట్ నివేదికను ఆయన​ సమర్థించారు.

"ఈ ఘటనకు ఎవరి కుమారుడు కారణమో.. ప్రజలకు తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి. ఇదే విషయంపై పార్లమెంట్​లో చర్చకు ప్రధాని మోదీ నిరాకరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. రైతులు, ప్రతిపక్షాల ఒత్తిడితోనే కేంద్రం రైతు చట్టాలను వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడి చేస్తేనే కేంద్రం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటుంది."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

లఖింపుర్ ఘటనపై చర్చించాల్సిందే..

Lakhimpur Kheri Case Parliament: అంతకుముందు.. లఖింపుర్ ఖేరీ ఘటన పార్లమెంటును కుదిపేసింది. లోక్ సభలో ఘటనపై చర్చించాలని అటు కాంగ్రెస్​తో పాటు విపక్షాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.

ఈ క్రమంలో.. విపక్ష సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు సభ ప్రారంభం కాగా.. విపక్షాలు మాత్రం లఖింపుర్​ ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్​సభకు గురువారానికి వాయిదా వేశారు స్పీకర్​.

ఇదీ చూడండి: Parliament live: కుదిపేసిన 'లఖింపుర్​' ఘటన- లోక్​సభ రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.