ETV Bharat / bharat

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం - నాగార్జున సాగర్​ జలాల పంపిణి సమస్య

KRMB on Nagarjuna Sagar Water Issue : కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు స్వాధీనం చేయాలనే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ వద్ద తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ప్రాజెక్టుల్ని స్వాధీనం చేయనందుకే ఈ పరిస్థితి వచ్చిందని కృష్ణా బోర్డు కూడా అభిప్రాయపడింది. సాగర్ వద్ద ప్రస్తుత పరిణామాలతో పాటు.. ఉమ్మడి జలాశయాలను బోర్డుకు స్వాధీనం చేసే విషయంపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ఏర్పాటు చేయనుంది.

KRMB Latest Meeting
KRMB Meeting on Nagarjuna Sagar Water Issue
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 7:04 AM IST

మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

KRMB on Nagarjuna Sagar Water Issue : నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వివాదం అంశాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చాయి. ఏపీ చర్యలపై నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. స్పందించిన కేఆర్ఎంబీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసి తక్షణమే నీటి విడుదల ఆపివేయాలని స్పష్టం చేసింది. జరిగిన పరిణామాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర జలశక్తి శాఖ(Telangana Explian to Central Hydropower Department)కు అన్ని విషయాలను వివరించింది.

Nagarjuna Sagar Water Issue AP and TS : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కృష్ణాబోర్డు ఛైర్మన్‌ శివ నందన్ కుమార్ మాట్లాడినట్లు సమాచారం. కృష్ణాపై ఉమ్మడి జలాశయాల(Common Reservoir on the Krishna) నిర్వహణ, రెండు రాష్ట్రాల వైఖరి, బోర్డు చేపట్టిన చర్యలను ఆయన కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిసింది. గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా ఉమ్మడి జలాశయాలు, సంబంధిత కాంపోనెంట్లను రెండు రాష్ట్రాలు బోర్డుకు స్వాధీనం చేస్తే సమస్యలు తలెత్తవని చెప్పినట్లు సమాచారం.

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

Nagarjuna Sagar Dam Controversy : నాగార్జున సాగర్​ డ్యామ్​ దగ్గర జరిగిన పరిణామాలు, బోర్డు స్వాధీనానికి సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖలో నివేదించినట్లు తెలిసింది. ఉద్రిక్తత నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా.. నవంబర్ 28 కంటే ముందు స్థితిని కొనసాగిస్తూ నాగార్జునసాగర్ డ్యాంను కేంద్ర సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో సీఆర్​ఫీఎఫ్​ బలగాలు శుక్రవారం రాత్రికే.. నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్‌కు చేరుకున్నాయి. డ్యామ్‌ను ఆధీనంలోకి తీసుకుని భద్రతను పర్యవేక్షించనున్నారని సమాచారం. కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు సీఆర్​ఫీఎఫ్​ బలగాలు(CRPF Forces at Nagarjuna Sagar Dam) పనిచేయనున్నాయి.

మళ్లీ మొదటికి వచ్చిన శ్రీశైలం, సాగర్‌ నిర్వహణ

KRMB Meeting With Central Hydro Power Department : కేంద్ర జల శక్తి శాఖ ఇవాళ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో హైబ్రిడ్ మోడ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డు చైర్మన్లు ప్రత్యక్షంగా పాల్గొంటారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌లను కూడా సమావేశానికి పిలిచారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తత తొలగించడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు.. సంబంధించిన కాంపోనెంట్లను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేసే విషయంపై సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.

Telangana Government Letter To KRMB : హంద్రీనీవా సుజలస్రవంతి పనులు ఆపించండి.. కేఆర్​ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.