Electric Bike Battery Blast: మహారాష్ట్రలోని వసాయ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించాడు.

అసలేం జరిగిందంటే..
తూర్పు వసాయ్ ప్రాంతంలో రాందాస్ నగర్‌కు చెందిన షానవాజ్ అన్సారీ.. సెప్టెంబరు 23వ తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్ అన్సారీ కుమారుడు షబ్బీర్, తల్లి రుక్సాన్‌కు తీవ్రగాయాలయ్యాయి.

షబ్బీర్‌కు కాలిన గాయాలు ఎక్కువగా అవ్వడం వల్ల చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ షబ్బీర్ మరణించాడు. స్కూటీ కంపెనీ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.