ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ యశ్వంత్​కే.. అక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక రాష్ట్రంలోని ఓట్లన్నీ గుంపగుత్తగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే పడనున్నాయి. అక్కడ భాజపా నుంచి ఒక్క, ఎమ్మెల్యే ఎంపీ కూడా లేరు. అదే కేరళ. ఈ కారణంగానే యశ్వంత్ సిన్హా అక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Yashwant Sinha
కేరళ ఓట్లన్నీ యశ్వంత్ సిన్హాకే
author img

By

Published : Jun 29, 2022, 3:43 PM IST

Yashwant Sinha: జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కేరళలోని ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లన్నీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హానే పడనున్నాయి. ఉన్న అన్ని ఓట్లు విపక్ష అభ్యర్థికే పోల్​ కానున్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే కానుంది. కేరళలో భాజపాకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేదు. దీంతో అధికార ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ నుంచి ప్రతి ఓటు యశ్వంత్​ సిన్హాకే రానుంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఒక్క ఓటు కూడా పోల్ అయ్యే అవకాశం లేదు.

Yashwant Sinha
కేరళ ఓట్లన్నీ యశ్వంత్ సిన్హాకే

President Candidate: కేరళలో అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​కు 99 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్​కు 41 మంది శాసనసభ్యులు ఉన్నారు. లోక్​సభ విషయానికొస్తే కాంగ్రెస్​కు 19 మంది ఉండగా, ఎల్​డీఎఫ్​కు ఒక్క స్థానం మాత్రమే ఉంది. అలాగే రాజ్యసభలో ఎల్​డీఎఫ్​కు ఏడుగురు సభ్యులు ఉండగా.. కాంగ్రెస్​కు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో రాష్ట్రం నుంచి ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 29 మంది ఎంపీల ఓట్లు, మొత్తం ఎమ్మెల్యేల ఓట్లు యశ్వంత్ సిన్హాకే పడనున్నాయి.

President Poll: 2017 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో భాజపా అభ్యర్థి రామ్​నాథ్ కోవింద్​కు కేరళ నుంచి ఒకే ఒక్క ఓటు పడింది. అప్పుడు కమలం పార్టీ నుంచి ఓ రాజగోపాల్​ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. ప్రస్తుతం కేరళ భాజపా నేత వి.మురళీధరన్​ విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్​ కూడా రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు వెళ్లారు.

Yashwant Sinha
కేరళ ఓట్లన్నీ యశ్వంత్ సిన్హాకే

దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక రాష్ట్రంలోని అన్ని ఓట్లు గుంపగుత్తగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు పడేది ఒక్క కేరళ నుంచి మాత్రమే. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో భాజపా, దాని మిత్రపక్షాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఈ కారణంగానే యశ్వంత్ సిన్హా కేరళ నుంచే రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్ ఎమ్మెల్యేలను తిరువనంతపురంలో బుధవారం విడివిడిగా కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ భేటీల అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారు.

Yashwant Sinha
కేరళ ఓట్లన్నీ యశ్వంత్ సిన్హాకే

కేరళ తర్వాత సిన్హా గురువారం తమిళనాడులో పర్యటిస్తారు. జులై 1న ఛత్తీసగఢ్​ వెళ్తున్నారు. అక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై.. ఆ మరునాడు జులై 2న తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో విడివిడిగా సమావేశమై రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరతారు.

ఇదీ చదవండి: ఒవైసీకి బిగ్ షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.