ETV Bharat / bharat

రుతుపవనాల రాక ఎన్నడో? జనం ఎదురుచూపులు.. IMD మౌనం - కేరళ రుతుపవనాల అంచనా 2023

Kerala Monsoon 2023 : దేశంలోకి జూన్ 1నే రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా.. వాటి ఆగమనం ఇంకా జరగలేదు. దీనిపై భారత వాతావరణ శాఖ అంచనాలు సైతం తప్పాయి. తాజాగా ఐఎండీ ఓ బులెటిన్​ విడుదల చేసింది. దాంట్లో ఏం ఉందో ఇప్పుడు చూద్దాం.

kerala monsoon 2023 start date
కేరళ రుతుపవనాలు
author img

By

Published : Jun 6, 2023, 2:06 PM IST

Monsoon Kerala 2023 : భారత్​లోకి రుతుపవనాల రాకపై స్పష్టత కొరవడింది. జూన్​ 1నే భారత్​లోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా.. వాటి రాక ఆలస్యమైంది. జూన్​ 4న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే నెలలో భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఆ అంచనాలన్నీ తప్పాయి. ఇప్పుడు ఈ విషయంపై ఐఎండీ మౌనం వహిస్తోంది. తిరిగి కొత్త తేదీలను సైతం వెల్లడించలేకపోతోంది.

కాగా మంగళవారం ఐఎండీ ఓ బులెటిన్​ విడుదల చేసింది. గుజరాత్‌లోని పోర్​బందర్‌కు దక్షిణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయవ్య దిశగా కదిలి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. గోవాకు పశ్చిమంగా నైరుతి దిశలో 920 కి.మీ, ముంబయికి నైరుతి దిశలో 1,120 కి.మీ, పోర్​బందర్‌కు దక్షిణంగా 1,160 కి.మీ, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణంగా 1,520 కి.మీ వేగంతో అల్పపీడనం ఏర్పడిందని.. ఐఎండీ తన ఓ ప్రకటనలో వివరించింది. ఇది దాదాపుగా ఉత్తరం వైపుగా కదిలి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా.. వచ్చే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ అల్పపీడన తీవ్రత దేశంలోకి రుతుపవనాల రాకను ప్రభావితం చేస్తుందని ఐఎండీ వెల్లడించింది. అయితే అందుకు సంబంధించిన సృష్టమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. కాగా స్కైమెట్ వెదర్ అనే ఓ ప్రైవేటు సంస్థ మాత్రం జూన్​ 8న లేదా 9న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది.

సాధారణంగా జూన్​ 1 నుంచి ఏడు రోజుల వ్యవధిలో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితులేమీ కనిపించటం లేదు. 2022లో మే 29న, 2021లో జూన్​ 3, 2020లో జూన్​ 1, 2019లో జూన్​ 8న, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి.

Kerala Monsoon Forecast 2023 : 2023లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం- ఐఎండీ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్ధగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్​ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్​లో భారత వాతావరణ శాఖ ఈ వివరాలను తెలియజేసింది.

ఐఎండీ అంచనాల ప్రకారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.