ETV Bharat / bharat

దేశంలోకి ఆలస్యంగా రుతుపవనాలు.. కేరళలోకి ప్రవేశించేది అప్పుడే.. - కేరళ రుతుపవనాలు 2023

Kerala Monsoon 2023 : జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావర​ణ శాఖ అంచనా వేసింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

monsoon-onset-in-kerala-2023-imd-expect-monsoon-onset-in-kerala-likely-to-be-on-june-4
జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు
author img

By

Published : May 26, 2023, 3:55 PM IST

Updated : May 26, 2023, 4:52 PM IST

Monsoon Kerala date : జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను ఐఎండీ వెల్లడించింది. జూన్​ 1న.. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది.

ఈ సంవత్సరం వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే వారం రోజుల్లో అరేబియా సముద్రంలో తుపాను వచ్చే అవకాశాలు కూడా లేవని సృష్టం చేసింది. ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి.. పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే కారణమని వెల్లడించింది.

"పాశ్చాత్య దేశాల్లో వాతావరణ అసమతుల్యత కారణంగానే.. భారత్​లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అందుకే దిల్లీతో పాటు చుట్టుపక్క నగరాలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఒకవేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయి. అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. వ్యవసాయంపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు" అని భారత వాతావరణ శాఖ తెలిపింది.

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్​ 1 నుంచి 7 రోజుల వ్యవధిలో కేరళలో అస్తమిస్తాయి. 2022 మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పుడు భారత వాతవరణ శాఖ మే 27న రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. కానీ రెండు రోజుల తరువాత అవి దేశంలోకి వచ్చాయి. గత 18 సంవత్సరాలుగా రుతుపవనాల విషయంలో కచ్చితమైన అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. 2015లో మాత్రం తమ లెక్క తప్పినట్లు పేర్కొంది. కాగా 2005 నుంచి కేరళకు రుతుపవనాల రాకను అంచనా చేసి.. వాటి వివరాలను వెల్లడిస్తోంది వాతావరణ శాఖ.

IMD Rain Forecast 2023 : 2023లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం- ఐఎండీ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్ధగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్​ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్​లో భారత వాతావరణ శాఖ ఈ వివరాలను తెలియజేసింది.

ఐఎండీ అంచనాల ప్రకారం..

Last Updated : May 26, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.