ETV Bharat / bharat

'కశ్మీర్ దేశస్థులను ఏమని పిలుస్తారు?'.. ఏడో తరగతి ప్రశ్నాపత్రంపై దుమారం - bihar latest news

కశ్మీర్​ మన దేశంలో భాగం కాదన్నట్లు ఓ పరీక్షలో అడిగిన ప్రశ్న ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ప్రశ్నలు అడిగింనందుకు ఆ బోర్డుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

bihar education board
bihar 7 th class question paper
author img

By

Published : Oct 19, 2022, 12:29 PM IST

ఎడ్యూకేషనల్​ బోర్డు నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రాలలో కశ్మీర్​ను ప్రత్యేక దేశంగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..
బిహార్​ కృష్ణగంజ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అర్ధవార్షిక పరిక్షల్లో ఏడవ తరగతి విద్యార్థులకు ఓ విస్తుపోయే ప్రశ్న ఎదురైంది. 'చైనా, నేపాల్, ఇంగ్లండ్, కశ్మీర్​, భారత్​లోని ప్రజలను ఏమని పిలుస్తారు?' అంటూ ప్రశ్న అడిగారు. అన్నీ దేశాల పేర్లు ఉండగా.. కశ్మీర్​ను సైతం అందులో భాగం చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కశ్మీర్​ భారత్​లో భాగం కాదని అదొక ప్రత్యేక దేశమనేలా అర్థం వస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

bihar 7 th class half yearly paper
ఏడవ తరగతి ప్రశ్నాపత్రం

సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాలోని మాధ్యమిక పాఠశాలల్లో పరీక్ష నిర్వహించగా.. రాష్ట్రంలోని బిహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాటిని పర్యవేక్షిస్తుంది. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2017లోనూ బోర్డు ఇదేతరహా ప్రశ్నను అడిగిందని మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా మానవ తప్పిదమని బోర్డు వివరణ ఇచ్చింది.

అయితే, ఇది కుట్రపూరిత చర్య అని భాజపా నేతలు మండిపడుతున్నారు. విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రికి తెలియజేస్తామని, దీనిపై చర్యలు తీసుకోవాలని బిహార్​ భాజపా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అంకిత్‌సింగ్‌ అన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన సమాధానమిచ్చేందుకు నిరాకరించారు.

ఇదీ చదవండి: భారీ వర్షాలు.. కుప్పకూలిన మైసూర్​ ప్యాలెస్​ గోడ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే!

ఉప్పల్‌ జంట హత్య కేసు ఛేదన.. విచారణలో వెలుగులోకి విస్తుగొలిపే వాస్తవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.