ETV Bharat / bharat

కర్తార్​పుర్​ కారిడార్​ రీఓపెన్- పంజాబ్ నేతల హర్షం - కర్తార్​పుర్​ సాహెబ్​ కారిడార్​ ప్రారంభం

కరోనా కారణంగా మూతబడిన కర్తార్​పుర్​ కారిడార్​ను​ (kartarpur sahib corridor).. బుధవారం తిరిగి తెరవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయంపై పంజాబ్​ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీహర్షం వ్యక్తం చేశారు.

Kartarpur Sahib corridor
కర్తార్​పుర్​ సాహెబ్​ కారిడార్​
author img

By

Published : Nov 16, 2021, 5:48 PM IST

పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌లో (kartarpur sahib pakistan) ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం సందర్శనకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన కర్తార్​పుర్ సాహెబ్​ కారిడార్​ను (kartarpur sahib corridor) బుధవారం తిరిగి తెరవనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. ఈ నిర్ణయం గురునానక్ దేవ్, సిక్కులపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అపారమైన గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని ట్వీట్​ చేశారు. దేశ ప్రజలంతా నవంబర్​ 19న గురునానక్ దేవ్ జయంతిని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ కారిడార్​ పాకిస్థాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌ మందిరాన్ని కలుపుతుంది. మరో మూడు రోజుల్లో గురునానక్​ దేవ్​ జయంతి ఉందనగా.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 2020 నుంచి నిలిపేసిన ఈ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన పంజాబ్​ సీఎం..

కర్తార్​పుర్ సాహెబ్​ కారిడార్​ను (kartarpur sahib corridor) తిరిగి తెరవాలన్న కేంద్రం నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్వాగతించారు. నవంబర్ 18 న కర్తార్​పుర్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, అక్కడ జరిగే కార్యక్రమంలో రాష్ట్రమంత్రి వర్గం కూడా పాల్గొంటుందని అన్నారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పంజాబ్​ సీఎం చన్నీతో పాటు.. పంజాబ్ పీసీసీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం అమరీందర్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా స్వాగతించారు.

ఇదీ చూడండి: ప్రవచనాలు చెబుతూనే ప్రాణం వదిలిన స్వామీజీ.. పుట్టిన రోజు నాడే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.