ETV Bharat / bharat

కాళ్లు, చేతులు కట్టేసుకొని.. 5 గంటల్లో సముద్రాన్ని ఈదిన వృద్ధుడు - karnataka old age swimmer

swimming with tied hands: 66 ఏళ్ల వయసులో సముద్రాన్ని ఈదేశారు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. అదీ మామూలుగా కాదండోయ్. చేతులు, కాళ్లకు చైన్లు కట్టుకొని ఈత కొట్టారు. నాలుగు గంటల 35 నిమిషాల్లో సముద్రాన్ని దాటేశారు.

OLD AGE SWIMMER
OLD AGE SWIMMER
author img

By

Published : Jan 25, 2022, 1:03 PM IST

Updated : Jan 25, 2022, 11:30 PM IST

5 గంటల్లో సముద్రాన్ని ఈదిన వృద్ధుడు

swimming with tied hands: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు అసాధారణ ఘనత సాధించారు. కాళ్లు, చేతులు కట్టేసుకొని అరేబియా సముద్రాన్ని నాలుగు గంటల 35 నిమిషాల్లోనే ఈదేశాడు. తద్వారా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు.

Old age swimmer crossed sea

ఉడుపికి చెందిన 66 ఏళ్ల గంగాధర్ కడేకర్.. పదుకెరే బీచ్ తీరం నుంచి ఈత ప్రారంభించారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మధ్యాహ్నం 1.25 వరకు ఏకధాటిగా ఈది.. మరో తీరానికి చేరుకున్నారు.

Swimming Arabian sea

గంగాధర్ సాధించిన అరుదైన ఫీట్​ను కొనియాడారు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​ ప్రతినిధి మనీశ్ విష్ణోయ్. సాధారణంగా రిటైర్ అయ్యే వయసులో ఆయన ఈ రికార్డు సాధించడం గొప్పవిషయమని అన్నారు.

Swimming sea with hands legs chained

తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు కడేకర్ చెప్పుకొచ్చారు. కాళ్లు చేతులు కట్టేసుకొని డాల్ఫిన్​లా ఈదినట్లు తెలిపారు. చిన్నారులకు ఆదర్శంగా నిలవాలని ఈ రికార్డు కోసం ప్రయత్నించినట్లు వెల్లడించారు.

ఎన్నో రికార్డులు!

karnataka-udupi-old-age-swimmer
పద్మాసనంలో ఈత కొట్టిన గంగాధర్

గతంలోనూ అనేక రికార్డులు నెలకొల్పారు కడేకర్. సరిగ్గా ఏడాది క్రితం.. 2021 జనవరి 24న పద్మాసనంలో కూర్చొని కాళ్లకు చైన్లు బిగించుకొని 1.4 కిలోమీటర్ల దూరాన్ని 73.7 నిమిషాల్లో ఈదారు. ఛాతి(బ్రెస్ట్​ స్ట్రోక్​)తో ఈతకొట్టిన గంగాధర్​ను చూసి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి కథనం, వీడియో కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి. అదే ఏడాది ఫిబ్రవరి 14న.. తన 41 మంది స్టూడెంట్స్​తో కలిసి ఈత కొట్టి రికార్డు సృష్టించారు.

ఇతరులకు పాఠాలు

యాభై ఏళ్ల వయసులో ఈత కొట్టడం ప్రారంభించిన ఆయన.. రెండేళ్ల క్రితం ఉడుపిలో జైదుర్గా స్విమ్మింగ్ క్లబ్​ను స్థాపించి ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. వెయ్యి మంది విద్యార్థులు ప్రస్తుతం ఆయన దగ్గర శిక్షణ పొందుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటారు కడేకర్. సీనియర్ స్థాయిలో 31 బంగారు, 16 వెండి, తొమ్మిది కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి సన్నటి నది ఇది.. వెడల్పు 4 సెంటీమీటర్లే!

Last Updated : Jan 25, 2022, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.