ETV Bharat / bharat

పగపట్టిన పాములు, 25 ఏళ్లుగా ఆ కుటుంబమే టార్గెట్, నాలుగేళ్లకోసారి కాట్లు - కర్ణాటక పాము పగ

పాముకాట్లు ఓ కుటుంబాన్ని 25 ఏళ్లుగా వెంటాడుతున్నాయి. ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవుతున్నారు. అందులో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలోని పురుషులను మాత్రమే పాములు కరవడం, పొలం పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఒకేచోట ప్రమాదం జరుగుతుండటం వల్ల కుటుంబీకులు భయాందోళనకు గురువుతున్నారు.

snakes bite same family people over 12 years

author img

By

Published : Aug 25, 2022, 4:04 PM IST

కర్ణాటక తుమకూరు జిల్లాలోని తొగరిఘట్ట గ్రామానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబం వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత 25 ఏళ్లలో ఆ కుటుంబానికి చెందిన 12 మంది పాముకాటుకు గురయ్యారు. వారిలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవ్వడం, అందులోనూ పురుషులకే ఆ ప్రమాదం జరుగుతుండటం.. ఆ కుటుంబీకులను భయాందోళనకు గురిచేస్తోంది.

snakes bite same family people over 25 years
బాధిత కుటుంబం

కుటుంబ పెద్ద ధర్మన్న మొదట పాముకాటుతో మృతిచెందారు. ఆ తరువాత హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్‌ ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కుటుంబంలోని గోవిందరాజు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పొలం పనులకు వెళ్తుండగా పాములు కాటేస్తున్న నేపథ్యంలో కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. ధర్మన్న కుటుంబానికి చెందిన పొలంలో పని చేసేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు కుటుంబీకులు సైతం పొలానికి వెళ్లేందుకు జంకుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.