ETV Bharat / bharat

ఐదేళ్ల క్రితం కులాంతర వివాహం.. ఇప్పుడు రూ.6లక్షలు ఫైన్, గ్రామ బహిష్కరణ - కులాంతర వివాహం చేసుకున్నందుకు జరిమానా

కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.6 లక్షల జరిమానా విధించారు పంచాయతీ పెద్దలు. అక్కడితో ఆగకుండా గ్రామ బహిష్కరణ చేశారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలో జరిగింది.

karnataka couple fined 6lakh rupees for inter caste marriage and  bycott the couple family from the villages
కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ.6జరిమానా
author img

By

Published : Mar 6, 2023, 3:27 PM IST

ప్రస్తుత కాలంలోనూ కులం కట్టుబాట్లు తప్పట్లేదు. గ్రామ పెద్దలు.. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ఊరి నుంచి వెలివేయడం ఇంకా కొనసాగుతోంది. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని చామరాజనగర్​లో జరిగింది. ఇద్దరు ప్రేమికులు కులాంతర వివాహం చేసుకున్నారని తెలిసిన తర్వాత గ్రామ పెద్దలు వారిని ఊరి నుంచి వెలివేశారు. అక్కడితో ఆగకుండా రూ.6 లక్షలు జరిమానా కూడా వేశారు. అసలేం జరిగిందంటే..

కూనగల్లి గ్రామానికి చెందిన గోవిందరాజు అనే యువకుడు శ్వేత అనే దళిత యువతిని ప్రేమించాడు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గోవిందరాజు ఉప్పరశెట్టి కులానికి చెందిన వ్యక్తి కాగా.. శ్వేత దళిత యువతి. ప్రేమికులిద్దరూ వారి తల్లిదండ్రులను ఒప్పించి 5 సంవత్సరాల క్రితం సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. గోవిందరాజు తన భార్యతో కలిసి మాలవల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులను చూడడానికి భార్య శ్వేతతో కలిసి కూనగల్లి గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో గోవిందరాజు దంపతులు కొద్ది రోజుల క్రితం కూనగల్లి గ్రామానికి వచ్చారు. శ్వేత పక్కింటి వారితో తాను ఎస్సీ కులానికి చెందిన యువతినని చెప్పింది. ఈ విషయం గ్రామపెద్దల వరకు వెళ్లింది. ఫిబ్రవరి 23న కూనగల్లి గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించారు. గోవిందరాజు.. గ్రామ కట్లుబాట్లు ధిక్కరించి వేరే కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడని రూ.3 లక్షల జరిమానా విధించారు. మార్చి 1లోగా జరిమానా కట్టేయాలని గడువు విధించారు.

కాగా.. గోవిందరాజు అవమానం భరించలేకపోయాడు. మార్చి 1న కొల్లేగల్ పోలీసులకు 12 మంది గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు మొదట విధించిన రూ.3 లక్షల జరిమానాను రూ.6 లక్షలకు పెంచేశారు. అలాగే గోవిందరాజు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరి నుంచి రేషన్, కూరగాయలు, పాలు, నీళ్లు కొనుగోలు చేయరాదని ఆజ్ఞాపించారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

దేవాలయంలోకి ప్రవేశించినందుకు ఇంటిపై దాడి
కర్ణాటక.. హవేరిలోని నందిహళ్లి గ్రామంలో దేవాలయంలోకి ప్రవేశించినందుకు దళిత కుటుంబం ఇంటిపై దాడి చేశారు. మార్చి 3న బసవేశ్వర ఆలయంలోకి దళిత మహిళ హెమ్మవ్వ, ఆమె కుమారుడు రమేశ్​ వెళ్లాలనుకున్నారు. వారిని అగ్రకులాల వారు ఆలయం ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకొని దుర్భాషలాడారు. అయినా తల్లీకొడుకులిద్దరూ ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో అదే రోజు రాత్రి అగ్రవర్ణాల వారు హెమ్మవ్వ ఇంటిపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఇంటి పైకప్పు పలకలను పగులగొట్టారు. రమేశ్​ బైక్‌ను సైతం ధ్వంసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30 మందిపై పోలీసలు కేసు నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.