ETV Bharat / bharat

ప్రియురాలి తల నరికి.. స్టేషన్​కు తీసుకెళ్లిన యువకుడు.. అందుకు ఒప్పుకోలేదనే! - Kudligi

ప్రియురాలిని దారుణంగా నరికి.. తలతో పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటక విజయనగర జిల్లాలో జరిగింది. మరో ఘటనలో పోలీస్ కస్టడీ అనంతరం.. ఓ వ్యక్తి చనిపోవడం కేరళ కోజికోడ్​లో కలకలం రేపింది.

Karnataka: A man beheaded lover and came to police station with severed head

author img

By

Published : Jul 22, 2022, 2:19 PM IST

తనతో ప్రేమ, పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమె ప్రాణాల్ని బలిగొన్నాడు. ఆమె తల నరికి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం కర్ణాటకలోని విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కన్నబొరనయ్యన హట్టిలో గురువారం జరిగింది.

గ్రామానికి చెందిన భోజరాజ్​ అనే యువకుడు ట్రాక్టర్​ డ్రైవరు. తన సమీప బంధువైన బసణ్న కుమార్తె నిర్మల (23) అనే బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఓసారి వారి ఇంటికెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం భోజరాజ్​కు మరో యువతితో వివాహమైంది. పొరుగు జిల్లాలో చదువుతున్న నిర్మల ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో నిర్మల ఇంటికి వెళ్లిన భోజరాజ్​ ఆమెతో గొడపడ్డాడు. తనతో తీసుకెళ్లిన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు. తలను బైకుకు ఉన్న సంచిలో పెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Karnataka: A man beheaded lover and came to police station with severed head
నిందితుడు భోజరాజ్​

కస్టడీ నుంచి వచ్చి విగతజీవిగా.. ఓ యాక్సిడెంట్​ కేసులో పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన 42 ఏళ్ల సంజీవన్​ అనే వ్యక్తి.. ఇంటికి చేరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి కేరళ కోజికోడ్​లో ఈ సంఘటన జరిగింది. కస్టడీలో పోలీసుల చిత్రహింసలతోనే ఆ వ్యక్తి మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. దీనిని ఖండించారు పోలీసులు. గుండెపోటుతో చనిపోయాడని వెల్లడించారు.

ఇదీ జరిగింది.. సంజీవన్​ మరో ఇద్దరితో కలిసి గురువారం రాత్రి కారులో వెళ్తూ వటాకర మరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిని స్టేషన్​కు తీసుకెళ్లి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని ఇంటికి వెళ్లమని చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం.. మార్గమధ్యలోనే హార్ట్​ అటాక్​తో చనిపోయినట్లు వివరించారు.

''సంజీవన్​, అతడి స్నేహితులను కారుతో సహా స్టేషన్​కు అర్ధరాత్రి తీసుకెళ్లాం. వారు తాగి ఉన్నారు. ఒక వ్యక్తి కనీసం నిల్చోలేకపోతున్నాడు. డ్రంక్​ అండ్​ డ్రైవింగ్​ కేసు నమోదు చేశాం. అనంతరం.. డ్రైవింగ్​ చేయొద్దని చెప్పి వదిలేశాం. మార్గమధ్యలోనే.. సంజీవన్​కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కొందరు.. అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.''

- విజీశ్​, వటాకరా స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​

ఇవీ చూడండి: కోడలిపై అత్తమామల చిత్రహింసలు.. కత్తితో పొడిచి.. ప్రైవేట్​ పార్టుల్లో కర్రను పెట్టి..

మహిళా కానిస్టేబుల్​ కుటుంబంలో ముగ్గురు మృతి.. బయట డోర్​ లాక్​.. దుర్వాసనతో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.