ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్ మండోలీ ప్రాథమిక వైద్య కేంద్రంలో ఓ నర్సు.. ఫోన్లో మాట్లాడుతూ మహిళకు రెండు కరోనా టీకా డోసులు ఒకేసారి ఇచ్చింది. ఈ ఘటనపై సీనియర్ వైద్యాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఏం జరిగింది?
ఏప్రిల్ 2 న, ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్కు చెందిన కమలేశ్ దేవి.. కరోనా టీకా తీసుకునేందుకు మండోలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. తనకు మొదటి డోసు ఇచ్చాక .. నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండో డోసునూ ఇచ్చారని ఆమె తెలిపారు. అలా ఎందుకు చేశావంటే.. తనతో వాగ్వాదానికి దిగారని వివరించారు.
ఇదీ చదవండి : ఆ గ్రామంలో ఫ్రీ ఇంటర్నెట్