Man beaten to death: కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో దారుణం జరిగింది. సరిపడినంత భోజనం పెట్టలేదని వృద్ధుడిని కర్రతో కొట్టి చంపాడు ఓ వ్యక్తి. అయితే అతని మానసిక స్థితి బాగోలేకపోవడం కారణంగా ఇలా చేశాడని పోలీసులు చెప్పారు.
![Mentally ill person was beaten to death a elderly man for failing to give a meal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14752180_aaaa.jpg)
ఇదీ జరిగింది..
కర్ణాటక కలబుర్గి జిల్లాలోని గొబ్బురుకు చెందిన సులేమాన్ పనవాలే అనే వ్యక్తిని మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కొట్టి చంపాడు. గ్రామ శివార్లలో ఉన్న పొలాల్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సులేమన్ రోజూలాగే తన పొలానికి వెళ్లారు. భోజన సమయం కావడం వల్ల పొలంలో ఉండే చింత చెట్టు కింద కూర్చుని తింటున్నాడు. ఇదే సమయంలో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. అయితే తాను తినే దానిలో కొంచెం అన్నం తనకు పెట్టాలని సులేమాన్‌ను కోరాడు. దీనికి సరేనని ఆ వ్యక్తి ఒక ప్లేట్లో అన్నం పెట్టాడు. అది తిని తనకు మరి కొంచెం కావాలని కోరాడు. సరిపడినంత లేకపోవడం వల్ల సులేమాన్ నిరాకరించాడు. ఇందుకు కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి పక్కన ఉన్న కర్ర తీసుకుని దారుణంగా కొట్టాడు.
దీంతో తీవ్ర రక్తస్రావమై వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై దేవాల్ ఘన్‌పుర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: