ETV Bharat / bharat

' భాజపా ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం' - అగ్నివీర్​లను భాజపా కార్యాలయాల్లో భద్రతా సిబ్బందిగా అవకాశం

Kailash vijayvargiya agneepath: అగ్నివీర్​లను ఉద్దేశించి భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అగ్నివీర్​లను భాజపా కార్యాలయం వెలుపల సెక్యూరిటీ గార్డుగా నియమిస్తామనడం దారుణమని కాంగ్రెస్ విరుచుకుపడింది.

Kailash vijayvargiya agneepath
కైలాశ్ విజయవర్గీయ
author img

By

Published : Jun 19, 2022, 6:01 PM IST

Updated : Jun 19, 2022, 7:35 PM IST

Kailash vijayvargiya agneepath: అగ్నివీర్​లపై భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. భాజపా పార్టీ కార్యాలయాల్లో భద్రతా సిబ్బందిగా అగ్నివీర్​లకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని ​విజయవర్గీయ ఆదివారం వ్యాఖ్యానించారు. యువత సైన్యంలో భాగమవ్వడం వల్ల క్రమశిక్షణ, విధేయత వంటి లక్షణాలను పెంపొందించుకుంటారని అన్నారు. ఉద్యోగ విరమణ నాటికి అగ్నివీర్​ల చేతిలో రూ.11 లక్షలు ఉంటాయని తెలిపారు. ఆదివారం అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తూ భోపాల్ భాజపా కార్యాలయంలో విజయవర్గీయ ఈ వ్యాఖ్యలు చేయగా.. విపక్షంతో పాటు సొంత పార్టీ ఎంపీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యాఖ్యలను భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ఖండించారు.

భాజపా నాయకుడు కైలాశ్‌ విజయవర్గీయ.. సైనికులను అవమానించారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తక్షణమే సైన్యానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అలాగే సోషల్ మీడియాలోనూ విజయవర్గీయ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'సైనికులను భాజపా ప్రధాన కార్యదర్శి అవమానించారు. అగ్నివీర్ సైనికులు భాజపా కార్యాలయం వెలుపల భద్రతా సిబ్బంది అవుతారని అంటున్నారు. ఇది సిగ్గులేని ప్రభుత్వం. అందుకే అగ్నిపథ్ పథకాన్ని వద్దని అంటున్నాం మోదీజీ' అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కైలాశ్ విజయవర్గీయ.. తన వ్యాఖ్యలను టూల్​కిట్​ గ్యాంగ్ వక్రీకరించిందని కాంగ్రెస్​ను ఉద్దేశించి విమర్శించారు. సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్​ పథకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువత, విపక్ష పార్టీలు డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్​టాపిక్​గా మారాయి.

ఇవీ చదవండి: 'అగ్నిపథ్​పై వెనక్కి తగ్గం.. ఆ నిరసనకారులను చేర్చుకోం!'

అగ్నిపథ్​పై కాంగ్రెస్ సత్యాగ్రహం- ప్రభుత్వాన్ని కూల్చే కుట్రన్న భాజపా

Last Updated : Jun 19, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.