ETV Bharat / bharat

వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్​ రెడ్డి.. తీర్పుపై ఉత్కంఠ..! - తెలంగాణ హైకోర్టులో అవినాష్​ రెడ్డి రిట్‌ పిటిషన్

MP AVINASH REDDY WRIT PETITION: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తోందని.. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా.. దర్యాప్తు సంస్థను ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో అవినాశ్‌రెడ్డి రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు.

MP AVINASH REDDY RIT PETITION
MP AVINASH REDDY RIT PETITION
author img

By

Published : Mar 10, 2023, 7:00 AM IST

AVINASH REDDY WRIT PETITION: మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మూడోసారి సీబీఐ విచారణకు హాజరు కాకముందే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మార్చి 10న మరోసారి విచారణకు రావాలని ఈ నెల 5న సీఆర్పీసీ 160 కింద సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు. ఇంతలోనే గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆడియో, వీడియో రికార్డు చేయాలి: అందులో సీబీఐ దర్యాప్తు అధికారి విచారణ తీరును అవినాష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదన్నారు. న్యాయవాదిని అనుమతించాలని, ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాసినా స్పందించలేదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆడియో, వీడియా రికార్డింగ్‌ చేసేలా ఆదేశించాలని కోరారు. న్యాయవాదిని అనుమతించాలని కోరారు.

సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి: తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అవినాష్​ కోరారు. ఇప్పటివరకూ రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందన్న అవినాశ్‌ రెడ్డి.. వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాశ్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

వాంగ్మూలంలో సవరణలు: తన వాంగ్మూలం నమోదు సందర్భంగా కంప్యూటర్‌ మానిటర్‌ కేవలం దర్యాప్తు అధికారికి, టైపిస్టుకు మాత్రమే కనిపిస్తోందని, తనకు కనిపించలేదని అవినాష్‌రెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు. విచారణ సమయంలో 30 , 40 సార్లు దర్యాప్తు అధికారి మౌస్‌ తీసుకుని సవరించారని, కొన్నింటిని తొలగించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఏవి తొలగించారో తనకు తెలియడం లేదన్నారు. వాంగ్మూలం ప్రతిని అడిగితే నిబంధనలు ఒప్పుకోవని నిరాకరించారన్నారు.

నన్ను ఇరికించేందుకు ప్రయత్నాలు: గూగూల్‌ టేకౌట్‌ డేటా గురించి ప్రశ్నిస్తూ.. సునీల్‌యాదవ్‌ తన ఇంట్లో ఉన్న విషయంపై అడిగారని, తాను ఈ విషయాన్ని నిరాకరించడంతో పాటు తనపై ఆరోపణలు చేసే ముందు డేటాను పరిశీలించాలని పలుమార్లు సూచించానన్నారు. కోర్టు ఆదేశాలు ఇవ్వని క్రమంలో సీబీఐ ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేపట్టబోదని తెలిపారు. తనను ఇరికించేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అవినాష్​.. వాంగ్మూలం కూడా కచ్చితంగా నమోదు చేయడం లేదనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

2010లో రెండో పెళ్లి చేసుకున్న వివేకా: రెండు సార్లు కడప ఎంపీగా ఎన్నికైన తనను.. సీబీఐ అధికారులు ఏకపక్షంగా విచారణకు పిలిచి ఇరికించాలని చూస్తున్నారని ..అవినాష్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య ఏవిధంగా జరిగి ఉంటుందో సీబీఐ ముందే నిర్ణయించుకుందని.. ఆ మేరకే విచారణ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మిగిలిన కోణాల్లో కాకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విచారణ చేస్తోందన్నారు. వివేకా 2010లో ముస్లిం మహిళ షమీమ్​ను రెండో వివాహం చేసుకున్నారని.. వారికి 2015లో కుమారుడు జన్మించినట్లు అవినాశ్‌ రెడ్డి పిటిషన్​లో ప్రస్తావించారు.

టీడీపీ బీటెక్​ రవితో టచ్​లో ఉన్న వివేకా అల్లుడు: వివేకా తన ఆస్తిని షమీమ్ కుటుంబానికి రాసిస్తాడనే ఉద్దేశంతో.. చాలా సార్లు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమార్తె సునీత గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వివేకా పేరుతో ఉన్న కంపెనీలకు సంబంధించిన చెక్ పవర్​ను కుమార్తె, అల్లుడు లాగేసుకున్నారని అవినాశ్‌ పేర్కొన్నారు. షమీమ్ కుమారుడు పేరుతో 2 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని వివేకా భావించడంతోనే ఇంట్లో గొడవలు తలెత్తాయని తెలిపారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో నిత్యం టచ్​లో ఉన్నారని అవినాశ్‌ ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.