ETV Bharat / bharat

5 కిలోల గుమ్మడికాయ రూ.47వేలు.. ఎందుకంత స్పెషల్? - కేరళ ఇడుక్కి న్యూస్

కేరళ ఇడుక్కిలో గుమ్మడికాయ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.47 వేలు. అదేంటి గుమ్మడికాయ అంత రేటు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ ఓ సారి చదివేయండి.

Jumbo pumpkin
గుమ్మడికాయ
author img

By

Published : Sep 10, 2022, 2:16 PM IST

సుమారు 5 కేజీల బరువు. ధర రూ.47 వేలు. ఏంటని అనుకుంటున్నారా? కేరళ ఇడుక్కిలో ఓ గుమ్మడికాయ.. వేలంలో పలికిన ధర ఇది. అదేంటి మరీ ఇంత ధర అనుకుంటున్నారా? అయితే ఓ సారి గుమ్మడికాయ గురించి తెలుసుకోవాల్సిందే.
ఇడుక్కిలోని చెమ్మన్నార్​ గ్రామం కొండ ప్రాంతంలో ఉంది. అయితే ఓనం పండగ సందర్భంగా నిర్వహించిన బహిరంగ వేలంలో 5కిలోల గుమ్మడికాయ భారీ ధర పలికింది. రూ.47 వేలకు వేలం పాడాడు ఓ వ్యక్తి.

Jumbo pumpkin
వేలంలో భారీ ధర పలికిన గుమ్మడికాయ

సాధారణంగా ఓనం పండగ సమయంలో నిర్వహించే వేలంలో పొట్టేలు, కోళ్లు వేల రూపాయలు పలుకుతాయి. అయితే ఈ సారి వేలంలో మాత్రం గుమ్మడికాయ భారీ ధర పలకడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వేలం పాట నిర్వహకులకు ఎవరో ఫ్రీగా ఇచ్చిన గుమ్మడికాయ ఇంత ధర పలకడం వల్ల సంతోషపడుతున్నారు.

ఇవీ చదవండి: 'ఆయనే నిజమైన దేవుడు!'.. వివాదాస్పద పాస్టర్​తో రాహుల్ సంభాషణ వైరల్

కల్తీ మద్యానికి ఐదుగురు బలి.. ఆ ఎన్నికలే కారణమట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.