Kashmir Earthquake: కశ్మీర్, నోయిడా సహా ఇతర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
అంతకుముందు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది.
అఫ్గానిస్థాన్- తజికిస్థాన్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్‌లోని కశ్మీర్, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడింది. ఈ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
పాక్‌లో భారీ భూకంపం..
పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ ట్వీట్ చేశారు.