జమ్ముకశ్మీర్ రజౌరీలో గురువారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ముష్కరుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీఓ) వీరమరణం పొందారు. మరో జవాను గాయాలపాలయ్యారు.
ఉగ్రవాదుల కదలికల సమాచారంపై కార్యోటె కలాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. దీంతో పరిస్థితి ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. అయితే గాయపడిన జేసీఓను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి