Jharkhand CM Corona: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో 15 మందికి కొవిడ్-19 నిర్ధరణ అయింది. వీరిలో సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్లూ ఉన్నారు. వీరితో పాటు సోరెన్ మరదలు సరళ మర్ముకూ వైరస్ నిర్ధరణ అయింది.
![Jharkhand CM Corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14137911_cm.jpg)
అయితే హేమంత్ సోరెన్‌కు మాత్రం పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. సోరెన్‌తోపాటు ఆయన మీడియా సలహాదారు, అసిస్టెంట్‌కు కూడా నెగెటివ్‌గా తేలింది. ముఖ్యమంత్రి నివాసంలో మొత్తం 62మందికి పరీక్షలు నిర్వహించారు అధికారులు.
మరోవైపు ఝార్ఖండ్‌లో కొత్తగా 5,081 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో ముగ్గురు కొవిడ్‌తో మృతి చెందారు.
కేజ్రీవాల్‌కు నెగెటివ్..
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కొవిడ్ పరీక్షలో నెగెటివ్‌గా తేలింది. తాను వైరస్ నుంచి కోలుకున్నానని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. జనవరి 4న ఆయన కొవిడ్-19 బారిన పడ్డారు.
ఇదీ చూడండి: దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు