ETV Bharat / bharat

'ఐదేళ్లుగా ఫోన్​కు దూరం.. అందుకే 100% స్కోర్!'.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన జేఈఈ టాపర్

జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థి. తాను గత ఐదేళ్లుగా జేఈఈ కోచింగ్ సమయంలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం మొబైల్​ను వాడలేదని తెలిపాడు. మరోవైపు, జేఈఈ ఫలితాల్లో మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) తెలిపింది. ఇందులో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.

jee result 2023
ధ్యానేశ్​ హేమేంద్ర శిందే
author img

By

Published : Feb 7, 2023, 6:22 PM IST

జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్​ హేమేంద్ర శిందే. తాను జేఈఈ కోచింగ్ సమయంలో ఫోన్​కు దూరంగా ఉన్నానని, అందుకే పరీక్షల్లో విజయం సాధించానని చెప్పాడు ధ్యానేశ్​. మరోవైపు, జేఈఈ ఫలితాల్లో ధ్యానేశ్​తోపాటు మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) తెలిపింది. వీరిలో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.

ఎన్​టీఏ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో ధ్యానేశ్.. 100 శాతం మార్కులు సాధించడంపై అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం థియరిటికల్ నాలెడ్జ్​తో పరిజ్ఞానంతో జేఈఈ పరీక్షల్లో విజయం సాధించలేమని తెలిపాడు ధ్యానేశ్​. ఎప్పటికప్పుడు సిలబస్​ను రివిజన్​ చేసుకోవాలని.., ప్రాక్టీస్ పరీక్షలు రాస్తూ టైంను సర్దుబాటు చేసుకోవాలని చెప్పాడు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఒక మార్కు తగ్గినా ర్యాంకులో వెనకబడిపోతామని అన్నాడు ధ్యానేశ్. అందుకే ఎల్లప్పుడూ వంద శాతం మార్కులను సాధించడానికి ప్రయత్నించాలని సూచించాడు.

jee result 2023
ధ్యానేశ్​కు స్వీట్ తినిపిస్తున్న అతడి తల్లి మాధవి

"నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు బీటెక్ కంప్యూటర్​ సైన్స్​లో చేరాలని నిశ్చయించుకున్నా. ఐఐటీ బాంబేలో సీటు సాధించాలని అనుకున్నా. నేను రాజస్థాన్​.. కోటాలోని అలెన్ కెరీర్ ఇన్​స్టిట్యూట్​లో జేఈఈ కోచింగ్ తీసుకున్నా. ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందని మొబైల్​ను వాడలేదు. దేశంలోనే కోటాను నాలెడ్జ్ సెంటర్​గా పిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యంతో ఉన్నవారికి కోటాలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నా సందేహాలన్నింటినీ కోచింగ్ ఇన్​స్టిట్యూట్​లో తీర్చుకునేవాడిని. రివిజన్ చేయడం, కష్టపడి చదవడం వల్ల జేఈఈలో 100 శాతం మార్కులు సాధించా."

--ధ్యానేశ్​ హేమేంద్ర శిందే

చిన్నప్పటి నుంచి ధ్యానేశ్​కు స్నేహితులు తక్కువేనని అతడి తల్లి మాధవి తెలిపారు. తమ కుమారుడు బాగా చదివే విద్యార్థులతో స్నేహం చేసేవాడని ఆమె చెప్పారు. డల్​గా ఉన్నప్పుడు ఉపశమనం కోసం సంగీతం వింటాడని మాధవి వెల్లడించారు.

మరోవైపు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష మొదటి విడత ఫలితాల్లో మొత్తం 20 మంది 100 శాతం మార్కులను సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన దుగ్గినేని వెంకట యుగేశ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి, బిక్కిన అభినవ్ చౌదరి, అభిహిత్ మాజేటి, గుత్తికొండ అభిరామ్​ 100 శాతం మార్కులు సాధించి సత్తా చాటారు.

jee result 2023
ఎన్​టీఏ విడుదల చేసిన జాబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.