ETV Bharat / bharat

కవలలతో భారత్​కు ఈశా.. 300 కిలోల బంగారం దానం చేయనున్న అంబానీ! - undefined

ఇటీవల కవలలకు జన్మనిచ్చిన ఈశా అంబానీ.. తన చిన్నారులతో సహా ముంబయికి చేరుకున్నారు. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ముకేశ్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

isha-ambani-with-twins-arrives
isha-ambani-with-twins-arrives
author img

By

Published : Dec 24, 2022, 4:27 PM IST

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ తన కవలలతో భారత్​కు చేరుకున్నారు. గత నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చిన ఈశా... ఖతార్ ఎయిర్​లైన్స్​కు చెందిన ప్రత్యేక విమానంలో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి శనివారం భారత్​కు వచ్చారు. కవలలకు అంబానీ, పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. చిన్నారుల రాక సందర్భంగా ముకేశ్‌ అంబానీ సతీసమేతంగా వొర్లిలోని ఈశా దంపతుల నివాసానికి వెళ్లి స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారులు అనంత్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీ కూడా ఉన్నారు. ఒక చిన్నారిని ఈశా అంబానీ ఎత్తుకోగా..మరో శిశువును అమ్మమ్మ నీతా అంబానీ ఎత్తుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Isha Ambani with twins
ఇషాకు స్వాగతం పలుకుతున్న నీతా అంబానీ

ఈ ఆనంద సమయంలో అంబానీ కుటుంబం ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకుంది. కవలలు ఇంటికి వచ్చిన సందర్భంగా 300 కిలోల బంగారాన్ని దానం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఐదు అనాథ శరణాలయాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతకుముందు, కవలలకు ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల నుంచి అర్చకులను రప్పించారు.

Isha Ambani with twins
ఇషా నివాసం వద్ద సందడి

ఈశా అంబానీ.. కాలిఫోర్నియాలో చిన్నారులకు జన్మనిచ్చినట్లు సమాచారం. కవలలు పుట్టిన వెంటనే ముంబయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం అమెరికాకు వెళ్లింది. అమెరికాలోని ప్రముఖ శిశువైద్య నిపుణుడు డా.గిబ్సన్.. చిన్నారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ కవలల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయికి ఆదియా అని, అబ్బాయికి కృష్ణా అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం తెలిపింది. ముకేశ్ కుమారుడు ఆకాశ్ అంబానీకి గతంలో ఓ కుమారుడు జన్మించారు. దీంతో ముకేశ్ రెండోసారి తాత అయినట్లైంది. ముఖేశ్​ అంబానీకి ముగ్గురు సంతానం కాగా ఆకాశ్​, ఇషాలు(31) కవలలు, మరో కుమారుడు అనంత్​ (27).

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.