ETV Bharat / bharat

ఇరాన్ పడవలో రూ.425 కోట్ల డ్రగ్స్.. ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్.. నీటి కుంటలో గోల్డ్ బిస్కెట్లు - iran boat heroin

భారత్​లోకి డ్రగ్స్ తరలిస్తున్న ఇరాన్ దేశస్థులను భారత కోస్టు గార్డు అడ్డుకుంది. వారి పడవలో 61 కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు తెలిపింది. దాని విలువ రూ.425 కోట్లు ఉంటుందని తెలిపింది. మరోవైపు, బంగాల్​లో 40 కేజీల బంగారాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. కెన్యా ప్యాసింజర్ బంగారం అక్రమ రవాణా చేస్తూ దిల్లీ విమానాశ్రయంలో దొరికిపోయినట్లు అధికారులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 7, 2023, 7:39 AM IST

దేశంలోకి డ్రగ్స్​ను తరలించేందుకు ప్రయత్నించిన ఓ పడవను భారత కోస్టు గార్డు (ఐసీజీ) సిబ్బంది అడ్డుకున్నారు. ఇరాన్​కు చెందిన ఆ బోటులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చిన వీరంతా.. గుజరాత్​లోని కచ్ జిల్లాలో ఉన్న ఓఖా తీరానికి దగ్గర్లో పట్టుబడ్డారు. బోటులో 61 కేజీల హెరాయిన్​ను వీరు తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.425 కోట్లు ఉంటుందని చెప్పారు. తమకు నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ నిర్వహించామని రక్షణ శాఖ ప్రజా సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. డ్రగ్స్ రవాణా గురించి గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ సమాచారం ఇచ్చిందని పేర్కొంది. దీంతో కోస్టు గార్డు అధికారులు వెంటనే స్పందించారని తెలిపింది. రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్​లను పెట్రోలింగ్​ కోసం రంగంలోకి దించారని తెలిపింది. అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా కనిపించే పడవలపై కోస్టు గార్డు నిఘా పెట్టినట్లు వెల్లడించింది.

Iran boat with with Rs 425 crore drugs
డ్రగ్ స్మగ్లర్లతో కోస్టు గార్డు
Iran boat with with Rs 425 crore drugs
ఇరాన్ పడవ

"సోమవారం రాత్రి సమయంలో ఓ పడవ భారత జలాల్లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఓఖా తీరానికి 340 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. భారత్​ వైపు వస్తున్న వారిని అడ్డుకునేందుకు కోస్టు గార్డు పడవలు ప్రయత్నించాయి. కానీ, వారు తప్పించుకునేలా ప్రవర్తించారు. పడవను కోస్టు గార్డు బోట్ల నుంచి దూరంగా పోనిచ్చారు. వారిని కోస్టు గార్డు వెంబడించింది. విజయవంతంగా వారిని అడ్డుకుంది. ఆ పడవ ఇరాన్​కు చెందినదని తేలింది. ఐదుగురు ఇరాన్ జాతీయులు అందులో ఉన్నారు. కోస్టు గార్డు పడవలో ఉన్న అధికారులు.. ఇరాన్ బోటును తనిఖీ చేయగా 61 కేజీల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.425 కోట్లు ఉంటుందని తేలింది. పడవను, అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాం. వారిని తీరానికి తీసుకొచ్చాం. తదుపరి విచారణ జరుగుతోంది."
-రక్షణ శాఖ ప్రకటన

నీటి కుంటలో 40కేజీల గోల్డ్
మరోవైపు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బంగాల్​లోని నదియా జిల్లాలో రూ.2.57 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. 40 బంగారం బిస్కెట్లు ఓ నీటి కుంటలో లభ్యమయ్యాయని తెలిపింది. తమకు అందిన పక్కా సమాచారంతో వీటి కోసం వెతికినట్లు పేర్కొంది. కల్యాణీ సరిహద్దు అవుట్​పోస్ట్​కు సమీపంలోని కుంటలో ఇవి కనిపించాయని వెల్లడించింది. కొద్ది నెలల క్రితం ఓ స్మగ్లర్​ వీటిని అందులో దాచిపెట్టాడని బీఎస్ఎఫ్ తెలిపింది. 'కొద్ది నెలల క్రితం ఓ స్మగ్లర్​ను అరెస్టు చేశాం. అప్పుడు అతడి వద్ద ఎలాంటి బంగారం దొరకలేదు. అనంతరం అతడిని విడుదల చేశాం. ఆ వ్యక్తే బంగారాన్ని ఇక్కడ దాచిపెట్టాడు. వాటిని తీసుకెళ్లడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు' అని బీఎస్ఎఫ్ వెల్లడించింది.

bsf bengal gold
బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లు
bsf bengal gold
.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్​లో బంగారం
కెన్యాకు చెందిన ప్యాసింజర్.. బంగారం అక్రమ రవాణా చేస్తూ దిల్లీ విమానాశ్రయంలో తమకు చిక్కినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్​లో ఏడు కేజీల బంగారాన్ని ప్యాసింజర్ అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ప్యాసింజర్.. నైరోబీ నుంచి మార్చి 6న దిల్లీలో దిగినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న నాలుగు నెలల శిశువుకు ఆక్సిజన్ అందించేందుకు పోర్టబుల్ కాన్సెంట్రేటర్​లను ప్రాసింజర్ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలతో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ప్యాసింజర్​ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

delhi kenya gold smuggling
ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్​లో బంగారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.