Indians in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్లు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.
![219 Indian nationals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14576391_indians.jpg)
![219 Indian nationals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14576391_indians123.jpg)
![219 Indian nationals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14576391_indians11.jpg)
భారతీయుల తరలింపునకు సాయం..
ఉక్రెయిన్‌పై దాడిని పోలండ్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని భారత్‌లో పోలండ్ రాయబారి ఆడమ్ బురాకౌస్కీ తెలిపారు. పోలండ్, ఇతర దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయన్నారు. ఐరోపా సమాఖ్య, ఇతర సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు తమ పౌరులకు కూడా పెద్ద సమస్యేనన్నారు. ఉక్రెయిన్ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్‌లోనే భారతీయ విద్యార్థి