ETV Bharat / bharat

హిమగిరుల్లో యుద్ధట్యాంకుల విన్యాసాలు - Indian Army operations in high altitude

చైనాతో సరిహద్దుల్లో భారత సైన్యం యుద్ధట్యాంకుల మోహరింపు ప్రారంభమై ఏడాది దాటింది. ఈ ప్రాంతంలో 17 వేల అడుగుల ఎత్తులో యుద్ధ ట్యాంకులు మరింత సమర్థవంతంగా పనిచేసేలా సాయుధ దళాలు ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాయి. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో విన్యాసాలు చేపట్టాయి.

Indian Army tank regiments prepared for operations
యుద్ధట్యాంకుల విన్యాసాలు
author img

By

Published : Aug 9, 2021, 12:41 PM IST

హిమగిరుల్లో యుద్ధట్యాంకుల విన్యాసాలు

తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వెంట భారీ యుద్ధ ట్యాంకుల మోహరింపు ప్రారంభమై ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో 14 వేల నుంచి 17 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఆ ట్యాంకులు మరింత సమర్థంగా ఉపయోగించేలా ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాయి సాయుధ దళాలు. ఈ క్రమంలో అధునాతన యుద్ధట్యాంకుల విన్యాసాలు చేపట్టాయి.

Indian Army tank regiments
హిమగిరుల్లో యుద్ధట్యాంకుల విన్యాసాలు

చైనా సరిహద్దుకు సమీపంలో..

చైనా సరిహద్దుకు కేవలం 40కిలోమీటర్ల దూరంలోనే.. ఈ యుద్ధ ట్యాంకుల విన్యాసాలు, అటాకింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి సాయుధ బలగాలు. అయితే అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద వీటిని నిర్వహించడం కష్టసాధ్యమంటున్న అధికారులు.. ట్యాంకులను సమర్థంగా నిర్వహించగలిగితే సుదీర్ఘ కాలం ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో యుద్ధ ట్యాంకుల నిర్వహణ కోసం గతేడాది.. మౌలిక వసతులను సృష్టించింది భారత సైన్యం. ట్యాంకు షెల్టర్లను సైతం నెలకొల్పింది.

Indian Army tank regiments
సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకుల విన్యాసాలు

"ఈ ఏడాది కాలంలో మైనస్ 45డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలకు అలవాటు పడ్డాం. చలి వాతావరణంలో.. పర్వత ప్రాంతాల్లో సమర్థంగా పనిచేసేలా ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాం" అని అధికారులు పేర్కొన్నారు.

కఠిన సవాళ్లను ఎదుర్కొనేలా..

పాంగాంగ్​ సరస్సు, గోగ్రా వంటి ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ.. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు భారీ సంఖ్యలో బలగాలను కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో భారతీయ సైన్యం తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తోంది. ట్యాంకులు ఐసీవీల ద్వారా ఈ పర్వత ప్రాంతాల్లో డ్రాగన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి విపత్తును ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.

గతేడాది చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న తర్వాత టీ-90 భీష్మ టీ-72 అజయ్ ట్యాంకులతో పాటు బీఎంపీ సిరీస్ పదాతిదళ పోరాట వాహనాలను ఎడారులు, మైదానాల నుంచి ఈ ఎత్తైన ప్రదేశాలకు భారీగా తరలించడం ప్రారంభించింది భారత సైన్యం. ఆయుధ సంపత్తిని సైతం సమకూర్చుకుంటోంది.

ఇదీ చూడండి: యుద్ధ సన్నద్ధతతో సైన్యం​.. అశాంతి సృష్టిస్తే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.