భారత్‌లో కరోనా కేసులు శనివారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 39,070 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 491 మంది మరణించారు. తాజాగా 43,910 మంది కొవిడ్‌ను జయించారు.
మొత్తం కేసులు: 3,19,34,455
మొత్తం మరణాలు: 4,27,862
కోలుకున్నవారు: 3,10,99,771
యాక్టివ్ కేసులు: 4,06,822
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 50,68,10,492 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం కొత్తగా 55,91,657 డోసులు అందించినట్లు పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా..
- కేరళలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,367 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో ఒక్కరోజే 1,610 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 32 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,773కు పెరిగింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 61 మందికి కరోనా సోకినట్లు తేలగా.. వైరస్ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,096 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 64 మంది మరణించారు.
- గుజరాత్లో 19 కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో టీకా తీసుకున్నవారి సంఖ్య 6,01,720కి చేరింది.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్‌లో మరో 18 మందికి కరోనా సోకినట్లు తేలింది.
- తమిళనాడులో కొత్తగా 1,969 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 29 మంది మరణించారు.
ఇదీ చూడండి: పిడుగుపాటుకు 24 మంది మృతి