ETV Bharat / bharat

దేశంలో 59శాతం భూభాగానికి భూకంప ముప్పు.. లిస్ట్​లో ఆ పెద్ద నగరాలు కూడా.. - భారత్‌కు భూకంపాల ముప్పు

తుర్కియే, సిరియాలో భూప్రళయంతో యావత్​ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మరి మన దేశంలో భూకంపం సంభవించే అవకాశాలు ఎంత ఉన్నాయి? ఏఏ ప్రాంతాలకు ముప్పు ఎక్కువగా ఉంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

INDIA EARTHQUAKES zones
INDIA EARTHQUAKES zones
author img

By

Published : Feb 11, 2023, 7:11 AM IST

ప్రకృతి విలయంతో తుర్కియే, సిరియా అతాలకుతలమయ్యాయి. అత్యంత శక్తిమంతమైన ఈ భూప్రళయం.. తీవ్ర నష్టాన్ని, పెను విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల క్రితం భారత్‌లోని దిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేయాయి. తుర్కియే విపత్తు నేపథ్యంలో భారత్‌కు భూకంపాల ముప్పు ఉందా? ఏయే ప్రాంతాలకు ఆ ప్రమాదం పొంచి ఉంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం.. భారత భూఫలకం ఏడాదికి 47 మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకుపోతోంది. గతంలో సంభవించిన భూకంపాల ఆధారంగా.. దేశంలోని ప్రాంతాలను నాలుగు భూకంప మండలాలుగా వర్గీకరించారు. అవి జోన్‌ 2, జోన్ 3, జోన్‌ 4, జోన్‌ 5. వీటిలో జోన్‌ 5 భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం కాగా.. జోన్‌ 2 తక్కువ తీవ్రత కలిగిన ప్రాంతంగా పేర్కొన్నారు. భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో 11 శాతం అత్యంత తీవ్రత కలిగిన జోన్‌ 5లో ఉంది. జోన్‌ 4లో 18శాతం, జోన్‌ 3లో 30శాతం, జోన్‌ 2లో 41శాతం ఉన్నట్లు 2021లో కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు.

భారత్​ మ్యాప్​

జోన్‌ 5:
భూకంపాల ముప్పు అత్యధికంగా ఉన్న జోన్‌ ఇది. కశ్మీర్‌, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర బిహార్‌, మధ్య బిహార్‌, ఈశాన్య భారత్‌ ప్రాతాలు, రాన్‌ ఆఫ్‌ కచ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి. దీన్ని వెరీ హై డ్యామేజ్‌ రిస్క్‌ జోన్‌గా పిలుస్తారు.

జోన్‌ 4:
ఇది హై డ్యామేజ్‌ రిస్క్‌ జోన్‌. దేశ రాజధాని దిల్లీ సహా జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, ఉత్తర పంజాబ్‌, చండీగఢ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని ప్రధాన భూభాగాలు, ఉత్తర బెంగాల్‌, సుందర్బన్‌ ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలో ఉన్నాయి.
జోన్‌ 3: ఇది మధ్యస్థ ప్రభావం కలిగిన జోన్‌. చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్‌ లాంటి ప్రధాన నగరాలు ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి.

జోన్‌ 2:
ఇది స్వల్ప తీవ్రత కలిగిన జోన్‌. ఈ ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తిరుచిరాపల్లి, బులంద్‌షహార్‌, మోరదాబాద్‌, గోరఖ్‌పూర్‌, చండీగఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాది భూభాగాలు ఈ జోన్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం సవరించిన భూకంప ప్రమాద మండలాల వర్గీకరణలో 'జోన్‌ 1' అనేదాన్ని ఉపయోగించలేదు. అందువల్ల ఏ ప్రాంతాన్నీ జోన్‌ 1గా గుర్తించలేదు.

భారత్ కూడా అత్యంత శక్తిమంతమైన భూకంపాలను చవిచూసింది. 2001లో చోటుచేసుకున్న భుజ్‌ భూకంపం, 1993లో సంభవించిన లాతూర్‌ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే, మన దేశంలో భూకంప ప్రూఫ్‌ బిల్డింగ్‌ పాలసీని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సాధారణంగా భూకంపాలు సంభవించినప్పుడు భవనాలు కుప్పకూలి అధిక ప్రాణనష్టం కలుగుతుంది. దాన్ని నివారించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. భవనాలు, ఇతర మౌలిక సదుపాయలను నిర్మించేప్పుడు ప్రభుత్వం విధించిన కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. భూకంప నిరోధక నిర్మాణానికి సంబంధించి భారతీయ ప్రమాణాల జాబితా కూడా ఉంది. ఇది నిర్మాణాల రూపకల్పన, భవనాల మరమ్మతు, పటిష్టతలపై సూచనలు చేస్తుంటుంది. ఏదేమైనా.. ప్రకృతి విపత్తులు ఈ సమయానికి వస్తాయని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యంకాని పని. అందువల్ల, అలాంటి విపత్తుల సమయంలో తీవ్ర నష్టం కలగకుండా ముందు నుంచే సన్నద్ధత అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.