ETV Bharat / bharat

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్రమంత్రులు.. స్టూడెంట్స్​ను త్వరగా తరలించేందుకే.. - ఉక్రెయిన్ భారత విద్యార్థులు

India Evacuation Ukraine: ఉక్రెయిన్​- రష్యా యుద్ధం తీవ్రతరమవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు పంపాలని నిర్ణయించింది..

pm modi meeting
కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం
author img

By

Published : Feb 28, 2022, 12:05 PM IST

Updated : Feb 28, 2022, 2:01 PM IST

India Evacuation Ukraine: ఉక్రెయిన్​- రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు పంపించనుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్​సింగ్ పూరి, జ్యోతిరాధిత్య సింధి యా, కిరెణ్ రిజిజు, వీకే సింగ్​ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.

రొమేనియా, మోల్డోవా నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను సింధియా చూసుకోనున్నారు. కిరెన్​ రిజుజు స్లొవేకియా, హర్దీప్​ సింగ్​ హంగేరి, వీ కే సింగ్ పోలాండ్​ వెళ్లనున్నారు.

pm modi meeting
కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్​తోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఉక్రెయిన్​లోని పరిణామాలపై ఆదివారం కూడా ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు ఐదు విమానాల్లో ఉక్రెయిన్​ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించారు అధికారులు. తాజాగా ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు భారత్​కు వచ్చారు. ఇంకా దాదాపు 16వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్​లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమారుడు.. దిగులుతో ఆగిన తల్లి గుండె

దిల్లీకి చేరిన ఐదో విమానం.. భారత్​కు మరో 249 మంది

Last Updated : Feb 28, 2022, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.