ETV Bharat / bharat

దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్​ - మహారాష్ట్రలో కరోనా

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్​ సోకింది. వైరస్​తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్​ను జయించారు.

India Corona virus cases
కరోనా కేసులు
author img

By

Published : Jan 16, 2022, 9:16 AM IST

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు. కొత్తగా.. 2,71,202 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 314 మంది మరణించారు. 1,38,331 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 37,122,164
  • మొత్తం మరణాలు: 4,86,066
  • యాక్టివ్ కేసులు: 15,50,377
  • మొత్తం కోలుకున్నవారు: 3,50,85721

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world:ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే 23,53,411 మందికి వైరస్​ అంటుకోగా.. 5,605 మంది మృతి చెందారు. ఇందులో దాదాపు 40 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

  • అమెరికాలో ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా విస్తరిస్తూ రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. శనివారం ఒక్కరోజే 4,02,735 కొత్త కేసులు వెలుగు చూశాయి. 882 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం కేసులు 66,662,877, మరణాలు 8,73,145కు చేరాయి.
  • ఫ్రాన్స్​లో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. డెల్టాతో పాటు ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభిస్తోంది. ఓ కొత్త వేరియంట్​ను గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 324,580 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 148 మంది మృతి చెందారు. 27వేల మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,894,255, మరణాలు 126,869కి చేరాయి.
  • ఇటలీలో వైరస్​ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1,80,426 మందికి వైరస్​ సోకింది. 239 మంది మరణించారు. 1,25,199 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 120,609కు చేరింది.
  • ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 1,03,836 మందికి వైరస్​ సోకగా.. 55 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,640, 386కు చేరింది.
  • అర్జెంటీనాలో కొవిడ్​ వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 96,652 మందికి వైరస్​ సోకింది. 88 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసులు 7,029,624కు చేరాయి.
  • బ్రిటన్​లో కొత్తగా 81,713 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 287 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటింది.
  • టర్కీలో 63వేలు, జర్మనీలో 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. బ్రెజిల్​, రష్యా, కొలంబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్​, బెల్జియం వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజుకు దాదాపు 30వేలకుపైగా కొత్తగా వైరస్​ బారినపడుతున్నారు.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.