ETV Bharat / bharat

మాస్కులపై పూత.. కొవిడ్​ నుంచి అదనపు రక్ష! - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి

కరోనా సోకకుండా రక్షణ కల్పించే మాస్కులను రూపొందించారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి పరిశోధకులు. 'నానోమీటర్ థిక్ సూపర్‌హైడ్రోఫోబిక్ కోటింగ్' మెటీరియల్‌ను అభివృద్ధి చేశారు. దీనితో సాధారణ వస్త్ర మాస్క్‌ల సామర్థ్యం మరింత మెరుగవుతుందని.. ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని తెలిపారు.

mask
మాస్కు
author img

By

Published : Nov 30, 2021, 5:56 AM IST

సాధారణ వస్త్రం లేదా సిల్క్‌ వస్త్రంతో రూపొందిస్తున్న మాస్కుల ద్వారా మరింత రక్షణ పొందేందుకు గువాహటిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు 'నానోమీటర్‌ థిక్‌ సూపర్‌ హైడ్రోఫోబిక్‌ కోటింగ్‌' పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఎన్‌-95 మాస్కు లేదా రెండు మాస్కులు కరోనా వైరస్‌ నుంచి బాగా రక్షణ కల్పిస్తాయి.

ఎన్‌-95 మాస్కు ధర ఎక్కువగా ఉండడం, రెండు మాస్కులను ఎక్కువ సేపు ధరిస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో ప్రజలు అందుబాటులో ఉన్న సాధారణ వస్త్రంతో, సిల్క్‌ వస్త్రంతో రూపొందించిన మాస్కులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర భారం కాకుండా, సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యామ్నాయ మాస్కులను రూపొందించేందుకు వస్త్ర మాస్కులపై పూత వేసేందుకు ఒక పదార్థాన్ని పరిశోధకులు కనుగొన్నట్లు గువాహటి ఐఐటీ తెలిపింది. కరోనా వైరస్‌ కణాల్ని ఈ పదార్థం తిరస్కరిస్తుందని, దీనిని పూతగా వేసిన మాస్కును ఎక్కువ సేపు ధరించడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది.

ప్రొఫెసర్‌ అరుణ్‌ ఛటోపాధ్యాయ, డాక్టర్‌ పార్థో ఎస్‌.జి.పత్తాదర్‌ల నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రేరణ గొగొయ్‌ తొలుత ఈ పరిశోధన పత్రాన్ని రూపొందించారు. ఈరి పట్టు వస్త్రంపై ఈ పదార్థంతో ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధన పత్రాన్ని ఇటీవల ‘ఏసీఎస్‌ అప్లైడ్‌ బయో మెటీరియల్స్‌’ జర్నల్‌ ప్రచురించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.