IDBI Bank Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1544 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూన్ 3న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం 1544లో.. 1044 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మరో 500 అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఐడీబీఐ. ఈ ఉద్యోగాలకు అర్హత డిప్లొమా, గ్రాడ్యుయేషన్గా నిర్ణయించింది ఐడీబీఐ. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 200, ఇతరులకు రూ. 1000గా ఖరారు చేసింది. 20-25 ఏళ్ల వయస్సువారు ఎగ్జిక్యూటివ్, 21-28 ఏళ్ల వయస్కులు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
నోటిఫికేషన్ వివరాలు:
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 03-06-2022
- దరఖాస్తులకు చివరి తేదీ: 17-06-22
- పరీక్ష తేదీ: 09-07-22
ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు రూ. 29 వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. అసిస్టెంట్ మేనేజర్లకు సంవత్సరం శిక్షణ కాలం పూర్తయిన అనంతరం.. నెలకు రూ. 36 వేల నుంచి ప్రారంభం అవుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై ఇలా..
స్టేట్ బ్యాంక్లో భారీగా ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.40వేలపైనే..!