IBPS SO Vacancy 2023 : దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్). మొత్తం 1402 స్పెషల్ ఆఫీసర్ పోస్టుల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. కేటగిరీల ఆధారంగా పోస్టులను కేటాయించిన ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 1 నుంచి స్వీకరిస్తున్నారు.
మొత్తం ఖాళీలు..
IBPS Jobs 2023 : 1402 పోస్టులు.
పోస్టులు వారీగా ఖాళీలు..
- ఐటీ ఆఫీసర్- 120
- అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్(ఏఎఫ్ఓ)- 500
- రాజ్‌భాషా అధికారి- 41
- లా ఆఫీసర్- 10
- హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్- 31
- మార్కెటింగ్ ఆఫీసర్(ఎంఓ)- 700
దరఖాస్తు చివరితేదీ..
IBPS SO Last Date : 2023 ఆగస్టు 21
ప్రిలీమ్స్ పరీక్ష తేదీలు..
IBPS SO Prelims : 2023 డిసెంబర్ 30,31
మెయిన్స్ ఎగ్జామ్..
IBPS SO Mains : 2024 జనవరి 28
దరఖాస్తు రుసుము..
- జనరల్, ఓబీసీ- 850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- 175/-
ఏజ్ లిమిట్..
IBPS SO Age Limit : అభ్యర్థుల వయసు 20-30 ఏళ్లలోపు ఉండాలి.
వయోపరిమితి సడలింపులు..
IBPS SO Age Relaxation : ఐబీపీఎస్ ఎస్ఓ XIII రిక్రూట్మెంట్ రూల్స్( IBPS SO Eligibility ) ఆధారంగా వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు కల్పించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
జీతభత్యాలు..
IBPS SO Salary : రూ.34,000-రూ.40,000
విద్యార్హతలు..
ఐటీ ఆఫీసర్
- బ్యాచిలర్ డిగ్రీలో బి లెవెల్ సర్టిఫికేట్ ఉండాలి.
- బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ.
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్(ఏఎఫ్ఓ)
బీటెక్-అగ్రికల్చర్ సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలి.
రాజ్‌భాషా అధికారి
డిగ్రీలో తీసుకున్న సెకెండ్ ల్యాంగ్వేజ్ (సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
లా ఆఫీసర్
IBPS SO Educational Qualification : లా డిగ్రీ (3 లేదా 5 సంవత్సరాలు)
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్
మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ పర్సన్నల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డీ, సోషల్ వర్క్, లేబర్ లా.
మార్కెటింగ్ ఆఫీసర్(ఎంఓ)
మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్, పీజీడీబీఏ, పీజీడీబీఎమ్, పీజీపీఎమ్, పీజీడీఎమ్.
అధికారిక వెబ్సైట్..
IBPS Website : పోస్టుల వారీగా సిలబస్‌తో పాటు మిగతా వివరాల కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ www.ibps.inను చూడండి.