chopper crash dead bodies: తమిళనాడు నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సైనికులందరి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. శనివారం గుర్తించిన 10 మందిలో ఆరుగురి భౌతికకాయాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన నలుగురి పార్థివదేహాలను ఆదివారం బంధువులకు అందజేస్తారు.
శనివారం తొలుత గుర్తించిన ఆరుగురిలో జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్, రాణా ప్రతాప్ దాస్, వింగ్ కమాండర్ పి.ఎస్.చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కె.సింగ్, లాన్స్నాయక్లు బి.సాయితేజ, వివేక్ కుమార్ ఉన్నారు. వీరిలో సాయితేజ మినహా అయిదుగురి మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ కర్నల్ హర్జిందర్ సింగ్, హవల్దార్ సత్పాల్, నాయక్ గుర సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్ల భౌతికకాయాలను గుర్తించారు. సీడీఎస్ బిపిన్‌రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్‌లకు శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి.
Cds general helicopter crash: డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగాను 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
ఇవీ చూడండి: