ETV Bharat / bharat

'దృశ్యం' సినిమా​ రిపీట్​..! భార్యను హత్య చేసి ఇంట్లోనే ఖననం.. ఆపై మిస్సింగ్ కంప్లైంట్​ - husband strangled wife

ఏడాదిన్నర క్రితం భార్యను హత్య చేశాడు ఓ భర్త. అనంతరం ఇంటి పరిసరాల్లో ఆమె మృతదేహాన్ని పూడ్చేశాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది.

husband killed wife and buried house premises in kerala
కేరళలో భార్యను చంపేసి అనంతరం పూడ్చేసిన భర్
author img

By

Published : Jan 13, 2023, 8:50 PM IST

భార్యను హతమార్చి అనంతరం ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టాడు ఓ భర్త. కేరళలోని కొచ్చిలో ఈ దారుణం జరిగింది. ఏడాదిన్నర క్రితం ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ అనంతరం మృతురాలి భర్తే.. ఈ ఘోరానికి పాల్పడట్లుగా తేల్చారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడు సంజీవ్​.. 2021, ఆగస్టు 16న తన భార్య రమ్యను గొంతు కోసి చంపాడు. తర్వాత ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా 2022 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగస్టు 2021 నుంచి తన భార్య కనిపించడం లేదంటూ వారికి చెప్పాడు. మొదటి నుంచి సంజీవ్​పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. సంవత్సరం పైగా ఈ కేసులో విచారణ జరిపి.. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. "2021, ఆగస్టులో భార్యభర్తలిద్దరికి ఫోన్ కాల్స్​ విషయంలో గొడవ జరిగింది. దీంతో భార్య రమ్యను హత్య చేశాడు సంజీవ్​. అనంతరం కొచ్చిలోని ఎడవనక్కడ్ గ్రామంలోని తన ఇంట్లోనే పూడ్చేశాడు." అని పోలీసులు తెలిపారు.

husband killed wife and buried house premises in kerala
కేరళలో భార్యను చంపేసి అనంతరం పూడ్చేసిన భర్

హత్య అనంతరం నిందితుడు.. తన భార్య రమ్య వేరే వ్యక్తి వెళ్లిపోయిందని బంధువులు, చుట్టుపక్కల వాళ్లను నమ్మించాడు. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఏడాదిన్నరకు పైగా ఈ కేసుపై విచారణ చేసిన పోలీసులు.. అనంతరం చేధించారు. నిందితుడు సంజీవ్​ను అరెస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.