ETV Bharat / bharat

How E-Passport Works and Its Benefits : ఈ-పాస్​పోర్ట్​ వచ్చేస్తోంది.. ఉపయోగాలు తెలుసా..? - భారత్​లో ఈ పాస్​పోర్ట్ సేవలు

E Passport Details in Telugu : విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్​పోర్ట్​లను తీసుకొస్తోంది. ఇందుకోసం వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఇవి గత పాస్​పోర్ట్​ల మాదిరిగానే సేవలు అందిస్తాయా? లేదా.. ఏవైనా తేడాలు ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి చాలా మందిలో! మరి, ఈ.. E-పాస్ పోర్టు సంగతేంటో మీరూ తెలుసుకోండి.

How E-Passport works
How E-Passport works and its benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 3:53 PM IST

Updated : Aug 30, 2023, 4:02 PM IST

How to Work E Passport in Telugu : ఇండియన్ పాస్​పోర్ట్ త్వరలోనే కొత్త రూపం సంతరించుకోనుంది. అధునాతన సెక్యూరిటీ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. అతి త్వరలోనే E-పాస్​పోర్ట్​లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం(Central Government).. ఈ మేరకు పాస్​పోర్ట్ సేవా ప్రోగ్రామ్ PSP V2.0ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ-పాస్​పోర్ట్ అంటే ఏమిటి..?

What is E-Passport in Telugu : ఇప్పటి వరకూ అమలులో ఉన్న హార్డ్ కాపీ పాస్​పోర్టుకు.. కొత్తగా రాబోతున్న ఈ-పాస్​పోర్టుకు.. సేవల్లో ఎలాంటి తేడా ఉండదు. అయితే.. హార్డ్ కాపీ పాస్ పోర్టులో ప్రయాణికుడి సమాచారం మొత్తం పేపర్లలో ముద్రించి ఉంటుంది. ఈ-పాస్ పోర్టు విషయానికి వస్తే.. ఈ ఇన్ఫర్మేషన్​ మొత్తం.. ఒక ఎలక్ట్రానిక్ చిప్​లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది బయోమెట్రిక్ డేటాతో పనిచేస్తూ.. సాంప్రదాయ పాస్‌పోర్ట్ కంటే మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ పాస్ పోర్టు ద్వారా.. ప్రయాణికుడి సమాచారాన్ని అధికారులు వెంటనే చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఈ తప్పులు చేశారో.. పాస్​పోర్టు రావడం కష్టమే

ఈ-పాస్‌పోర్ట్‌ ద్వారా కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు :

E Passports Benifits :

భద్రత పెరుగుతుంది(Increased Safety) : ఈ-పాస్​పోర్ట్​లో పొందుపరిచిన మైక్రోచిప్‌లు.. బయోమెట్రిక్ డేటా వంటి అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారా.. భద్రత మెరుగుపడుతుంది. దీనివల్ల.. గుర్తింపు, చోరీ, మోసపూరిత కార్యకలాపాల తీవ్రత తగ్గుతుంది. ఈ-పాస్​ పోర్టుతో నకిలీదాన్ని తయారు చేయడం లేదా.. సమాచారాన్ని మార్చడం చాలా కష్టతరం.

ధృవీకరణ వేగవంతం (Rapid Identification Verification) : e-పాస్​పోర్టులోని బయోమెట్రిక్ సమాచారం ద్వారా.. ధ్రువీకరణ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా.. ప్రయాణికుడి వివరాలను ఖచ్చితంగా గుర్తించే వీలుంది. రోబోటైజ్డ్ ఫేషియల్ అక్నాలెడ్జ్‌మెంట్, ప్రత్యేకమైన ఫింగర్ ఇంప్రెషన్ చెకింగ్ మరింత సేఫ్టీనిస్తాయి. దీనివల్ల ఎంతో సమయం కలిసి వస్తుంది.

మాన్యువల్ చెకింగ్ తగ్గిపోతుంది : ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించే ప్రయాణికులు సరిహద్దులు దాటాడానికి అంతగా నిరీక్షించాల్సిన పని ఉండదు. మెకనైజ్ ఐడెంటిఫికేషన్ కంట్రోల్ డోర్లు వీసా హోల్డర్ వ్యక్తిత్వాన్ని త్వరగా నిర్ధారిస్తాయి. ఇంకా.. మాన్యువల్ రిపోర్ట్ చెక్‌ల అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. తద్వారా.. మానవ మధ్యవర్తిత్వం పరిమితం అవుతుంది.

డిజిటల్ మీడియా యాక్సెసిబిలిటీ ఇంటిగ్రేషన్(Accessibility And Integration Of Digital Media) : ఈ-అంతర్జాతీయంగా ప్రయాణాలు సాగిస్తున్నప్పుడు.. వీసా హోల్డర్ డేటాను కంప్యూటర్లో నమోదు చేయాల్సి వస్తే.. ఈ-పాస్ పోర్టు ఉపయోగకరంగా ఉంటుంది. డేటాను సరిచూసుకోవడం ఈజీ అవుతుంది. ఇంకా.. ఆన్‌లైన్లో అప్లికేషన్స్ ఇవ్వాల్సి వచ్చినా, అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చినా.. e-పాస్‌పోర్టు ద్వారా వేగంగా పనులు పూర్తవుతాయి.

సురక్షిత సమాచార నిల్వ (Secure Information Stockpiling) : ఈ-పాస్‌పోర్ట్ మైక్రోచిప్‌లోని వ్యక్తిగత డేటా.. సురక్షిత డేటా ఎన్‌క్రిప్షన్ పద్ధతుల ద్వారా స్టోర్ చేయబడుతుంది. అందువల్ల అనధికారికంగా.. ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు.

How to Check Passport Status in Online : పాస్​పోర్ట్ స్టేటస్ ఎంతదాకా వచ్చింది.. మొబైల్​లో ఈజీగా చెక్ చేయండిలా..!

Passport Services In Hyderabad : పాస్​పోర్ట్​ సేవలు మరింత చేరువ.. ఇక నుంచి తపాలా కార్యాలయాల్లోనూ

విదేశాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. ఇక ఆ సర్టిఫికెట్‌ అప్లై ఆన్‌లైన్‌లోనే!

Last Updated : Aug 30, 2023, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.