ETV Bharat / bharat

Horse Library : గుర్రంపై మినీ లైబ్రరీ.. ఊరూరా తిరుగుతూ.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతూ.. - విద్యార్థుల కోసం గుర్రపు లైబ్రరీ

Horse Library for Students : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ఓ వ్యక్తి. గుర్రంపై గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి.. వివిధ గ్రామాలు తిరిగి చిన్నారులకు పుస్తకాలు అందిస్తున్నాడు. ఉత్తరాఖండ్​లో భారీ వర్షాల కారణంగా పాఠశాలకు వెళ్లలేని విద్యార్థుల కోసం ఈ గుర్రపు లెబ్రరీని ఏర్పాటు చేశాడు.

horse-library-for-students-in-uttarakhand-to-increase-reading-skills-students
ఉత్తరాఖండ్ గుర్రపు లైబ్రరీ
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 8:23 PM IST

గుర్రంపై మినీ లైబ్రరీ.. ఊరూరా తిరుగుతూ.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతూ..

Horse Library for Students : గుర్రంపై గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాడు ఓ వ్యక్తి. వినూత్నంగా ఆలోచించి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాడు. కొండలెక్కి, కోనలు దాటి మరి.. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారుల చెంతకు పుస్తకాలను చేరుస్తున్నాడు. ఉత్తరాఖండ్​లో భారీ వర్షాల కారణంగా చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకపోవడాన్ని గుర్తించిన.. శుభమ్ బధాని అనే వ్యక్తి గుర్రం గ్రంథాలయానికి శ్రీకారం చుట్టాడు.

నైనితాల్​ జిల్లాకు చెందిన శుభమ్ బధాని.. 2023 వేసవి కాలం సెలవుల్లో మొబైల్​ లైబ్రరీని ప్రారంభించాడు. సెలవుల్లో ఇంటివద్దే ఉన్న పిల్లలకు చదువుపై ఆసక్తి పోకుండా.. సహృదయంతో బైక్​పై మొబైల్​ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. అయితే భారీ వర్షాల కారణంగా.. సెలవుల అనంతరం కూడా విద్యార్థులెవ్వరూ పాఠశాలకు వెళ్లలేకపోయారు. అంతేకాకుండా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడి.. రోడ్లన్నీ మూసుకుపోయాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. జనజీవనమంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇక చేసేది లేక కొంత కాలం పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో బైక్​పై మొబైల్ లైబ్రరీని నడిపేందుకు శుభమ్​ బధానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బైక్​పై మొబైల్​ లైబ్రరీ నడపడం అతడికి సాధ్యం కాలేదు. ఎలాగైనా మొబైల్​ లైబ్రరీని విద్యార్థుల చెంతకు చేర్చాలన్న సంకల్పంతో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టి.. గుర్రం లైబ్రరీని ఏర్పాటు చేశాడు శుభమ్​ బాధాని. అనంతరం దాని సాయంతో ప్రతి ఊరు తిరిగి చిన్నారుల్లో పఠనాసక్తిని పెంచుతున్నాడు. కొండ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా పుస్తకాలకు అందిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని శుభం బాధాని వెల్లడించాడు.

"వేసవి సెలవులు, భారీ వర్షాలు పిల్లల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో పిల్లలకు చదువును దూరం చేయకూడదనే ఈ గుర్రపు లైబ్రరీని ప్రారంభించాను. అయితే మొదట్లో నేను ఊరు ఊరు తిరిగి చిన్నారులకు పుస్తకాలు అందించేవాడిని. తరువాత కొద్ది రోజులు బైక్​పై వచ్చేవాడిని. ఇప్పుడు గుర్రంపై వెళ్తున్నాను" అని శుభం బాధాని తెలిపాడు. రోడ్లు బాగాలేకపోయినా.. గుర్రంపై సులువుగా గ్రామాలకు చేరుకోవచ్చని పేర్కొన్నాడు.

Horse Library for Students in uttarakhand to increase reading skills students
గుర్రపు లైబ్రరీ

స్థానిక యువకులతో ఏర్పాటైన సంకల్ప్ యూత్ ఫౌండేషన్ ప్రొత్సహంతో ఈ గుర్రపు లైబ్రరీని నిర్వహిస్తున్నట్లు శుభమ్ బధాని తెలిపాడు. జల్నా గ్రామానికి చెందిన కవితా రావత్, బధానీకి చెందిన సుభాష్ బధాని అనే వ్యక్తులు.. ప్రారంభ దశలో సాయం చేసినట్లు వివరించాడు. జిల్లాలోని సుదూర కోటబాగ్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బఘ్ని, జల్నా, మహల్ధుర, అలేఖ్, గౌటియా, ధిన్వఖారక్, బన్సీ వంటి గ్రామాల్లోని చిన్నారులకు పుస్తకాలు అందిస్తున్నట్లు శుభం వివరించాడు. తన ప్రయత్నానికి చిన్నారుల తల్లిదండ్రులు సైతం బాసటగా నిలిచారని శుభం బాధాని పేర్కొన్నాడు.

Brother Sister Temple Bihar : 'అన్నాచెల్లెళ్ల ఆలయం'.. భక్తుల వినూత్న పూజలు.. 'రాఖీ'రోజు మాత్రమే దర్శనం!

Worlds Tallest Nataraja Statue Delhi : 19 టన్నులు.. 8 లోహాలు.. భారీ నటరాజ విగ్రహం.. దిల్లీకి పయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.