ETV Bharat / bharat

రాఖీ రోజే అక్కను ఆమె ప్రియుడ్ని చంపిన తమ్ముడు - జల్​గావ్​ పరువు హత్య

Honor Killing రాఖీ పండగ రోజే పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోతుందన్న కారణంతో అక్క సహా ఆమె ప్రియుడిని చంపాడు తమ్ముడు. మహారాష్ట్ర జల్​గావ్​లో ఈ ఘటన జరిగింది. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు.

Honor killing Brother killed sister and her boyfriend in jalgaon

author img

By

Published : Aug 13, 2022, 5:54 PM IST

Honor Killing: అక్కకు రక్షగా ఉండాల్సిన తమ్ముడే.. ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని కూడా హతమార్చాడు. రాఖీ పండగ రోజే ఈ అమానవీయ ఘటన జరగడం కలచివేస్తోంది. మహారాష్ట్ర జల్​గావ్​లో శుక్రవారం రాత్రి ఈ పరువు హత్య కలకలం రేపింది. మైనర్​ అయిన నిందితుడు హత్య అనంతరం పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు.

Honor killing Brother killed sister and her boyfriend in jalgaon
వర్ష సమాథాన్​ కోలీ

రాకేశ్​ సంజయ్​ రాజ్​పుత్​

ఇదీ జరిగింది.. రాకేశ్​ సంజయ్​ రాజ్​పుత్​(22), వర్ష సమాథాన్​​ కోలీ(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం వర్ష ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తమ్ముడు పిస్టల్​ తీసుకొని వారిని వెంబడించాడు. ఈ క్రమంలోనే రాజ్​పుత్​ను కాల్చి చంపిన నిందితుడు.. తన సోదరిని గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధాన నిందితుడు పిస్టల్​తో పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. మరో మైనర్​ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో భాగమైన మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఛోప్టా సమీపంలోని జునా వరాడ్​​ శివార్లలో మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: దుస్తులలో రూ100 కోట్ల డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

కదలకుండా ఎంతో బుద్ధిగా రాఖీ కట్టించుకున్న చిరుత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.