వలపు వల(Honey trap) విసిరి తమ బుట్టలో వేసుకుంటారు. అనంతరం వారిని లాడ్జికి రప్పిస్తారు. తర్వాత వారితోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తారు. మహారాష్ట్ర ఠాణెలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు చేశారు.
యాప్‌ల సాయంతో..
నిందితులు వివిధ యాప్‌ల సాయంతో వినియోగదారులను ఆకర్షిస్తారు(Honey trap). ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేస్తారు. ఈ మేరకు ఠాణె వగ్లే ఎస్టేట్ డివిజిన్ ఏసీపీ జయంత్ బజ్బేల్ తెలిపారు.
"బాధితులను నిందితులు తాము ముందుగా నిర్ణయించుకున్న ఓ లాడ్జికి రప్పించేవారు. ఆ తర్వాత వారిని దోచుకునేవారు. శ్రీనగర్ పోలీసులు ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50,000 నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. వీటి మొత్తం విలువ రూ.1.20 లక్షలు" అని బజ్బేల్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:
Honey trap: కిలాడీ కపుల్.. హనీట్రాప్‌తో 300 మందికి టోకరా!
Honey Trap: సైనైడ్‌తో చంపేస్తుంది.. గుప్త నిధులు, రైస్ పుల్లింగ్ పేరుతో...