ETV Bharat / bharat

ఆమెకు ఎయిడ్స్​.. అయినా 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం.. పాపం ఆ చిన్నోడు.. - మైనర్​తో వివాహేతర సంబంధం

15 ఏళ్ల బాలుడికి ఆమె పిన్ని. హెచ్​ఐవీ కారణంగా ఇప్పటికే భర్తను కోల్పోయింది. ఆ మహమ్మారి సోకి ఆమె కూడా నరకం చూస్తోంది. అయినా మైనర్​తో​ లైంగిక సంబంధం పెట్టుకుని అతడి భవిష్యత్​ను ప్రమాదంలో పడేసింది. ఉత్తరాఖండ్​ రుద్రపుర్​లో జరిగిందీ అమానుష ఘటన.

HIV positive aunt made illicit relationship
ఎయిడ్స్
author img

By

Published : Apr 5, 2022, 10:37 AM IST

ఎయిడ్స్​ ఎంత ప్రమాదకరమో ఆమెకు బాగా తెలుసు. ఆ మహమ్మారి కారణంగా ఇప్పటికే భర్తను కోల్పోయి ఒంటరిదైపోయింది. ఎయిడ్స్​ సోకడం వల్ల ఆమె భవిష్యత్​ కూడా అంధకారమైంది. అయినా ఆమె అత్యంత నిర్లక్ష్యంగా, విచక్షణారహితంగా వ్యవహరించింది. కుమారుడి వరుసయ్యే బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుని అతడి భవిష్యత్​నూ చిదిమేసింది. చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

మాయ మాటలు చెప్పి..: ఉత్తరాఖండ్​ ఉధమ్​సింగ్​ నగర్ జిల్లా రుద్రపుర్ ప్రాంతంలోని ట్రాంజిట్ క్యాంప్​ ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొన్నాళ్ల క్రితం భర్తను కోల్పోయింది. ఆమె కూడా ఎయిడ్స్ బారినపడింది. అయితే.. తన బంధువైన 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నుపడింది. అతడికి మాటమాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. మైనర్​తో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం చాలా కాలంగా సాగుతోంది. అయితే.. ఇటీవల ఇద్దరూ అభ్యంతరకర పరిస్థితిలో ఉండగా.. బాలుడి కుటుంబసభ్యులు చూశారు.

అసలే ఆమెకు ఎయిడ్స్.. అందులోనూ మైనర్​తో లైంగిక సంబంధం.. ఈ వ్యవహారం ఆ కుటుంబంలో పెను దుమారానికి కారణమైంది. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. చివరకు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది బాలుడి కుటుంబం. ఆమెపై బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ తన కుమారుడి భవిష్యత్​ను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను తక్షణమే అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించగా.. జైలుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.