ETV Bharat / bharat

భారీగా హెరాయిన్​ సీజ్​.. సోప్​ బాక్సుల్లో, డీజిల్​ ట్యాంక్​లో.. విలువ రూ.450 కోట్లకుపైనే.. - హెరాయిన్​ సీజ్​ మహారాష్ట్ర

Herion Seized: దేశంలో పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్య నిరోధక శాఖ అధికారులు, పోలీసులు కలిసి చేపట్టిన విస్తృత సోదాల్లో.. భారీగా హెరాయిన్​, గంజాయి పట్టుబడింది. రూ.450 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఐదుగురిని అరెస్టు చేశారు.

Heroin worth Rs 450crore seized in maharastra and assam

author img

By

Published : Jul 15, 2022, 9:31 PM IST

Herion Seized: మహారాష్ట్రలోని ముంబయి పోలీసులు.. అంతర్జాతీయ మార్కెట్​లో క్లెయిమ్​ చేయని కంటైనర్​ నుంచి 168 ప్యాకెట్లలో ఉన్న రూ.362.5 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి-పుణె హైవేకు ఆనుకుని ఉన్న రాయ్‌గఢ్ జిల్లాలోని యార్డ్‌లో కంటైనర్ పడి ఉందని అధికారులు తెలిపారు. మొదట స్వాధీనం చేసుకున్న పదార్థం మార్ఫిన్​ అని అనుమానించామని, తర్వాత హెరాయిన్​గా తేలిందని చెప్పారు.

అసోంలోని కరీంగంజ్ జిల్లా​లో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో రూ.మూడు కోట్ల విలువైన హెరాయిన్​ పట్టుబడింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో కరీంగంజ్ పోలీసులు అసోం-మిజోరం సరిహద్దులో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. గురువారం అర్ధరాత్రి బరైగ్రామ్ వద్ద పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వాహనంపై అనుమానం వచ్చి అడ్డుకున్నారు. అనంతరం విస్తృత తనిఖీలు చేపట్టారు. సబ్బు పెట్టెల్లో ప్యాక్ చేసి, ఇంధన ట్యాంక్ లోపల, వాహన మడ్‌గార్డ్‌లో దాచిన 477 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వాహన డ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.

మరో చోట 122 కిలోల హెరాయిన్ స్వాధీనం.. అదే జిల్లాలో మరో చోట సోప్​ బాక్సుల్లో తరలిస్తున్న 122 కిలోల హెరాయిన్​ను పట్టుకున్నామని, వాటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్​ చేశామని తెలిపారు.

477 కిలోల గంజాయి​ స్వాధీనం.. అసోంలోని కర్బీ అంగ్లాంగ్​ జిల్లాలో ట్రక్కులో తరలిస్తున్న 477 కిలోల గంజాయిని పోలీసులు సీజ్​ చేశారు. ఈ ఘటనలో ఒకర్ని అరెస్ట్​ చేశారు. వాహనంపై 'ఆర్మీ ఆన్​ డ్యూటీ' స్టిక్కర్​​ అతికించి ఉందని, అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహిస్తే 46 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుందని చెప్పారు.

ఇవీ చదవండి: స్టంట్​ పేరుతో నదిలోకి జంప్​.. తిరిగిరాని యువకుడు.. వీడియో వైరల్​!

'పిల్లలు ఏడింటికే స్కూల్​కు వెళ్తుంటే.. మనమెందుకు రాలేం?': సుప్రీం జడ్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.