ETV Bharat / bharat

భారత్‌-పాక్‌ యుద్ధంలో పోరాడిన వీర జవాన్‌ మృతి.. సంతాపం ప్రకటించిన ప్రధాని - 1971 భారత్‌ పాక్‌ యుద్ధంలో పోరాడిన జవాన్ మృతి

1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో పోరాడిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ లాన్స్‌నాయక్‌ భైరాన్‌సింగ్‌ రాథోర్‌(81) జోధ్​పుర్​లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంతాపం తెలిపారు.

Hero of Longewala in 1971 Indo-Pak war Bhairon Singh Rathore passes away
భారత్‌-పాక్‌ యుద్ధంలో పోరాడిన జవాన్‌ లాన్స్‌నాయక్‌ భైరాన్‌సింగ్‌ రాథోర్‌
author img

By

Published : Dec 19, 2022, 8:33 PM IST

1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో పోరాడిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ లాన్స్‌నాయక్‌ భైరాన్‌సింగ్‌ రాథోర్‌(81) జోధ్​పుర్​ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. భైరాన్‌సింగ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో పాటు.. భారత సరిహద్దు భద్రత దళం సంతాపం ప్రకటించింది. 1971 లాంగేవాలా యుద్ధంలో అతని ధైర్యసాహసాలు గుర్తుచేసుకున్న బీఎస్​ఎఫ్​.. దేశానికి సింగ్‌ ఎంతో సేవ చేశారని కొనియాడింది. యుద్ధసమయంలో ఆయన జైసల్మేర్‌ థార్‌ ఎడారిలో.. బీఎస్​ఎఫ్ యూనిట్‌ కమ్మాండింగ్‌ అధికారిగా పనిచేశారు.

డిసెంబరు 5, 1971న దాడికి తెగించిన.. పాకిస్థానీ బ్రిగేడ్, ట్యాంక్ రెజిమెంట్‌ను నాశనం చేయడంలో కీలకపాత్ర పోషించారు. బీఎస్​ఎఫ్ 14వ బెటాలియన్‌ పోస్టింగ్‌లో ఉన్న సమయంలో పంజాబ్‌ రెజిమెంట్‌పై పాకిస్థాన్‌ దాడిచేసింది. సింగ్‌ ఒక్కరే తుపాకీతో పాక్‌ సైనికులను అంతమొందించారు. భైరాన్‌ సింగ్‌ ధైర్యసాహసాల ఆధారంగా 1997లో సునీల్‌ శెట్టీ కథానాయకుడిగా "బార్డర్‌" చిత్రం తెరకెక్కింది. సింగ్‌ పార్థివ దేహానికి అతని స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బీఎస్​ఎఫ్ తెలిపింది.

ఇవీ చదవండి:

తాజ్​మహల్​కు ఇంటి పన్ను చెల్లించాలంటూ ఏఎస్‌ఐకి నోటీసులు

రెండున్నర నెలల పసిబిడ్డతో.. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.