ETV Bharat / bharat

కొవిడ్​ ఆంక్షలను ఎత్తేస్తున్న రాష్ట్రాలు - corona virus restrictions india

Covid Restrictions: భారత్​లో కరోనా రోజూవారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో అన్ని రకాల కొవిడ్ నిబంధనలను ఎత్తివేసింది అక్కడి సర్కారు. ఉత్తరాఖండ్​ కూడా ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకునేందుకు అనుమతించింది.

Covid restrictions
covid restrictions lifted
author img

By

Published : Feb 17, 2022, 6:35 AM IST

Covid Restrictions: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు ధోరణిని పరిగణనలోకి తీసుకొని ఆంక్షలను సవరించాలని లేదా పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో హరియాణాలోని అన్ని కొవిడ్ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజలు మాత్రం కరోనా జాగ్రత్తలను పాటించాలని స్పష్టంచేసింది.

ఉత్తరాఖండ్​లోనూ..

రోజూవారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నెలన్నరగా కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూను బుధవారం ఎత్తివేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అంతేగాక జిమ్​లు, షాపింగ్​మాల్స్​, సినిమా హాల్స్​, స్పాలు, సెలూన్స్​, థియేటర్లు, ఆడిటోరియాలు ఇతర సమావేశ మందిరాలను పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది.

అయితే స్విమ్మింగ్​పూల్స్​, వాటర్​ పార్క్స్​ మాత్రం ఫిబ్రవరి 28 వరకు మూతబడే ఉండనున్నాయి. ఎన్నికల ర్యాలీలు, ధర్నాలపై నిషేధం కూడా ఈ నెల 28 వరకు కొనసాగనుంది. హోటల్స్​, రెస్టారెంట్స్​ పూర్తి సామర్థ్యంతో నిర్వహించవచ్చని, అయితే కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సర్కారు తెలిపింది.

ఇదీ చూడండి: 'ఆ ఆంక్షలు ఎత్తేయండి!'.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.