ETV Bharat / bharat

హనుమాన్ ఆలయాన్ని వెనక్కి జరిపిన ఇంజినీర్లు.. మూలవిరాట్​ను తాకకుండానే.. - జై దుర్గే లిస్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీ

జాతీయ రహదారి పక్కనున్న​ దేవాలయాన్ని ఎనిమిది అడుగులు వెనక్కి జరిపారు ఇంజినీర్లు. రోడ్డు విస్తరణకు వీలుగా గుడిని జాగ్రత్తగా వెనక్కి జరిపారు అధికారులు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 31, 2022, 7:37 PM IST

హనుమాన్​ దేవాలయం

జాతీయ రహదారి పక్కనున్న ఓ హనుమాన్​ దేవాలయాన్ని ఎనిమిది అడుగులు వెనక్కి జరిపారు ఇంజినీర్లు. రహదారి విస్తరణకు వీలుగా గుడిని జాగ్రత్తగా వెనక్కి జరిపారు అధికారులు. ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్‌పుర్ జిల్లా కచియాని ఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. లఖ్​నవూ-దిల్లీ జాతీయ రహదారిని ఆనుకొని ఈ హనుమాన్ మందిరం ఉంది. ఆలయ మూలవిరాట్​ను తాకకుండా పనులు చేస్తున్నారు.

Hanuman temple in uttarpradesh
ఉత్తర్​ప్రదేశ్​ హనుమాన్​ దేవాలయం
Hanuman temple in uttarpradesh
ఉత్తర్​ప్రదేశ్​ హనుమాన్​ దేవాలయం

అక్టోబర్​ నెలలో హరియాణాకు చెందిన జై దుర్గే లిస్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీ ఈ బాధ్యతలు చేపట్టింది. అప్పుడే పనులు ప్రారంభించింది. గత బుధవారం వరకు ఎనిమిది ఫీట్ల మేర ఆలయాన్ని వెనక్కు జరిపింది. అనుకున్న స్థానానికి ఆలయాన్ని జరపడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని షిఫ్టింగ్ కంపెనీ తెలిపింది.

Hanuman temple in uttarpradesh
ఉత్తర్​ప్రదేశ్​ హనుమాన్​ దేవాలయం
Hanuman temple in uttarpradesh
ఉత్తర్​ప్రదేశ్​ హనుమాన్​ దేవాలయం

జాకీలను ఉపయోగించి గుడిని వెనక్కి జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. ఆలయ మూలవిరాట్​ను తాకకుండా ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ హనుమాన్ దేవాలయం దాదాపు 15 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 64 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు కలిగి ఉంది. కాగా, ఇదే సమయంలో దేవుడి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.